బండి డైవర్ట్ అవుతుంది..కేసీఆర్‌ కు చెక్ పెట్టాలంటే అలా చేయాల్సిందే?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి రాజకీయం నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకాలం బీజేపీ నేతలు చేసిన విమర్శలకు డైరక్ట్‌గా స్పందించని సీఎం కేసీఆర్…ఇప్పుడు డైరక్ట్‌గా మీడియా సమావేశం పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అంటే కేసీఆర్ డైరక్ట్‌గా రంగంలోకి దిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫైర్ అవుతున్నారు. మళ్ళీ వేరే నేతల పేర్లు తీయడం లేదు. ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరుని తెరపైకి తీసుకురావడం లేదు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలిచాక, కేసీఆర్‌లో కాస్త ఫ్రస్టేషన్ పెరిగిందనే చెప్పాలి. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈటల గెలుపుతో కేసీఆర్‌కు పోటీ ఇచ్చే నాయకుడు దొరికారని తెలంగాణలో ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే కేసీఆర్….బండి పేరుని హైలైట్ చేస్తున్నారు. ఆయన టార్గెట్‌గానే విమర్శలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ బండిని తిట్టడం…బండి ఏమో కేసీఆర్‌పై విమర్శలు చేయడం.

అలాగే బీజేపీ నేతలు సైతం కేసీఆర్‌పై ఫైర్ అయిపోతున్నారు. ఇక్కడే కేసీఆర్ ట్రాప్‌లో బీజేపీ పడినట్లు కనబడుతోంది. పూర్తిగా కేసీఆర్…బండిని డైవర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా విమర్శల దాడి చేసి…బండిని వేరే పని మీద దృష్టి పెట్టేలా చేయనివ్వలేదు. ఇక ఇలాగే మాటల యుద్ధం కొనసాగితే, రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కష్టం. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి అనుకున్నంత బలం ఏమి లేదు. ఇప్పటివరకు సాధించిన విజయాలు నాయకులు బట్టి వచ్చాయి…అంటే బీజేపీకి సొంత బలంతో గెలిచిన సందర్భాలు తక్కువ.

పైగా తెలంగాణలో అన్నీ జిల్లాల్లో బీజీపేకి బలం లేదు. చెప్పాలంటే కాంగ్రెస్‌కే ఎక్కువ బలం ఉంది. బీజీపే క్షేత్ర స్థాయిలో బలంగా లేదు. కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే క్షేత్ర స్థాయిలో బలపడాలి. అలా కాకుండా ఇలా మాటల యుద్ధం చేయడం వల్ల పావలా ఉపయోగం లేదు. కాబట్టి బండి డైవర్ట్ కాకుండా…బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news