కాంగ్రెస్ టీంతోనే కేసీఆర్…క్లారిటీ అప్పుడే!

-

మొత్తానికి దేశ రాజకీయాల్లో మార్పు తీసుకోస్తానని చెప్పి కేసీఆర్…జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అది కూడా మామూలుగా ఎంట్రీ ఇవ్వడం లేదు…ఏకంగా జాతీయ పార్టీతో ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. త్వరలోనే జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతోనే కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఆయన దేశంలోని విపక్ష పార్టీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామితో కూడా భేటీ అయ్యి జాతీయ పార్టీ గురించి చర్చించారు.

అయితే అంతా బాగానే ఉంది గాని..కేసీఆర్ భేటీ అయ్యే నేతలంతా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన వారు..లేదంటే కాంగ్రెస్ పట్ల సానుకూలతతో ఉన్నవారే. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగి…చివరికి బీజేపీకి మేలు జరుగుతుందని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని కలవరని, కాంగ్రెస్ లో ఉన్న నాయకులను మాత్రమే కలుస్తారని అంటున్నారు.

అలా అనుకుంటే ఏపీ, ఒడిశా సీఎంలు, అలాగే కాంగ్రెస్ పార్టీతో లేని ఇతర పార్టీల నేతలని కేసీఆర్ ఎందుకు కలవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బలంగా లేని బీజేపీని పెంచి, కాంగ్రెస్-బీజేపీ మధ్య ఓట్లు చీలిపోయేలా చేసి…మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న పార్టీలని వేరు చేసి…మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నారని రేవంత్ ఫైర్ అవుతున్నారు.

అయితే రేవంత్ చెప్పే మాటల్లో కాస్త లాజిక్ ఉంది..అయినా కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సత్తా చాటడం చాలా కష్టమైన పని. కేసీఆర్ ఏమో కాంగ్రెస్ లేకుండా కూటమి కట్టాలని అనుకుంటే ఉపయోగం కూడా ఉండదు. కాకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు కాంగ్రెస్ ఊసు తీయకుండా, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌టో కలుస్తారా? అనే డౌట్ అందరికీ ఉంది. మరి కాంగ్రెస్ ఏమో కేసీఆర్ తో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. చూడాలి మరి కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news