కాంగ్రెస్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఆ నిర్ణ‌యం.. కొండా సురేఖ ఏం చేస్తారో..

-

తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. మొద‌టి నుంచి ఇక్క‌డే టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఓ రేంజ్‌లో ప్ర‌చారం చేస్తూ ఇప్ప‌టికీ అన్ని ఊర్ల‌ను చుట్టేస్తున్నాయి. అంతే కాదు ఇప్ట‌పికే ఇరు పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి స‌మావేశాలు, స‌భ‌లు, ప్రచారాల‌తో దూసుకుపోతున్నాయి. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు క్యాండిడేట్ ను కూడా అనౌన్స్ చేసుకోలేక సైలెంట్ గా ఉంది. చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చినా ఎవ‌రికీ టికెట్ ద‌క్క‌ట్లేదు.

congress
congress

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇస్తార‌నే ప్ర‌చారం బాగా సాగినా చివ‌ర‌కు ఆమెకు కూడా ఇవ్వ‌కుండా ఆసక్తి ఉన్న నేతలు గాంధీ భ‌వ‌న్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ఇక ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు తేదీ మొన్నటి ఆదివారంతో అయిపోయింది. దీంతో ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింది. అదేంటంటే కొండా సురేఖ మాత్రం ఇందులో ద‌ర‌ఖాస్తు చేసుకోలేదు. 18 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 11 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు అయితే మిగ‌తా ఏడుగురు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారివి.

అయితే ఇందులో ఏ ఒక్క‌రు కూడా టీఆర్ఎస్‌, బీజేపీ అబ్య‌ర్థుల‌కు పోటీ ఇచ్చే స్థాయి లేరంట‌. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. కొండా సురేఖకు ఇవ్వాల‌ని భావిస్తున్న అధిష్టానం ఆలోచ‌న‌ను ఆమె సీరియ‌స్ గా తీసుకోలేద‌ని అందుకే ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని తెలుస్తోంది. ఇక ఆమెకు కాకుండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అలాగ‌ని నేరుగా సురేఖ‌కు ఇస్తే ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి దరఖాస్తు గడువు పెంచేసి అప్పుడు ఎలాగోలా సురేఖ‌ను బుజ్జిగించి దరఖాస్తు చేయించి ఆమెకు టికెట్ ఇవ్వాల‌ని అధిష్టానం ఆలోచిస్తోంది. చూడాలి మ‌రి ఆమె ద‌ర‌ఖాస్తు చేస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news