లాజిక్ మిస్ అయిన కౌశిక్.. బుక్ అయినట్లేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరి నిలబడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీజేపీ నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్ నెక్స్ట్ ఎలాగైనా హుజరాబాద్ లో బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తున్నారు.

ఇక ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హుజరాబాద్ లో మకాం వేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి తిరుగుతున్నారు. హుజరాబాద్ గులాబీ పార్టీ కంచుకోట అని చెప్పేసి చాటి చెప్పాలనుకుంటున్నారు. అయితే టిఆర్ఎస్, బిజెపిలు హుజురాబాద్ బరిలో హోరాహోరీగా తలపడుతున్నాయి.

కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఇక్కడ ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. అయితే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని చెప్పేసి కౌశిక్ రెడ్డి తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ లో ట్విస్ట్ వచ్చింది. టిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని చెప్పి కౌశిక్ రెడ్డి, ఒక కార్యకర్తతో మాట్లాడుతున్న ఆడియో వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరింది. అయితే కౌశిక్ మాత్రం వివరణ ఇవ్వకుండా డైరెక్ట్‌గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇక్కడే కౌశిక్ రెడ్డి లాజిక్ మిస్ అవుతున్నారు.

రేవంత్ రెడ్డికి పిసిసి రావాలని కోరుకునే వాళ్ళలో తాను ఉన్నానని అని చెప్పిన కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పిసిసి కొనుక్కున్నారని చెప్పి ఆరోపించారు. పిసిసి రావాలని కోరుకున్న కౌశిక్,  తర్వాత డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ కొనుక్కున్నారని అని చెప్పి లాజిక్ లేకుండా మాట్లాడారు.  అలాగే టిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని మాట్లాడిన ఆడియోపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే గతంలోనే కౌశిక్ రెడ్డి, టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అది ఎప్పుడో ప్రైవేట్ పార్టీలో కలిశానని చెప్పి కౌశిక్ వివరణ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కౌశిక్‌పై అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సమయం కోసం చూస్తున్న కాంగ్రెస్, కౌశిక్ రెడ్డి ఆడియో బయటికి రావడంతో షోకాజ్ నోటీసు జారీ చేసింది.

దీంతో కౌశిక్ ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. దీన్ని బట్టి చూస్తే కౌశిక్ పరోక్షంగా టిఆర్ఎస్‌కి మద్దతుగా ఉన్నారని అర్థమవుతుంది. మరి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్ టిఆర్ఎస్‌లో చేరి హుజురాబాద్ ఎన్నిక‌ల బ‌రిలో నిలబడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news