ఫస్ట్ టైమ్….కే‌టి‌ఆర్‌ ఏంటి ఈ ఫ్రస్టేషన్…బొమ్మ కనబడుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాల దూకుడు మరింతగా పెరిగిపోయింది. అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పిలు వరుసపెట్టి టి‌ఆర్‌ఎస్‌ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అసలు విమర్శలే కాదు…కే‌సి‌ఆర్‌పై ఓ రేంజ్‌లో మాటల దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు…కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్‌లని బాగా ర్యాగింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ktr
ktr

ఇంతకాలం కే‌సి‌ఆర్‌కు ప్రతిపక్షాల ఎఫెక్ట్ తగల్లేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారింది…ఓ వైపు టి‌ఆర్‌ఎస్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. మరోవైపు బి‌జే‌పి, కాంగ్రెస్‌లు పుంజుకుంటున్నాయి…టి‌ఆర్‌ఎస్ చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్, బండిలు పనిచేస్తున్నారు. పైగా ఇటీవల వారు ఎలాంటి సభ పెట్టిన భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు. తాజాగా వారు పెట్టిన సభలు కూడా హిట్ అయ్యాయి. దీంతో మంత్రి కే‌టి‌ఆర్‌లో ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.

మామూలుగా కే‌టి‌ఆర్…కాస్త నిదానంగానే కౌంటర్లు ఇస్తారు…దూకుడుగా మాట్లాడినా సమన్వయంతోనే ఉంటారు. కానీ ఈ సారి కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తోంది. రేవంత్, బండిలపై విరుచుకుపడుతూనే, వారు హద్దులు దాటి మాట్లాడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకోమ‌ని బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొడ‌తామ‌ని మాట్లాడారు. సరే కే‌టి‌ఆర్ బాగా ఫైర్ మీద మాట్లాడారు అనుకోవచ్చు. కానీ చిన్నపిల్లల మాదిరిగా కే‌టి‌ఆర్ కామెంట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరైనా కొడితే చిన్నపిల్లలు…మా అమ్మతో చెబుతా…మా నాన్నతో చెబుతా అన్నట్లుగా… తమని నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని అన్నారు.

అంటే కే‌సి‌ఆర్ గానీ, టి‌ఆర్‌ఎస్ నేతలుగానీ ఎప్పుడు ప్రత్యర్ధులని నోటికొచ్చినట్లు తిట్టలేదా? అంటే అబ్బో ఇష్టారాజ్యంగానే తిట్టారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యర్ధులు తిడుతుంటే కే‌టి‌ఆర్‌కు ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. అందుకే అధికారంలో ఉన్నారు కాబట్టి…బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం కేసు పెడతానని హెచ్చరిస్తున్నారు. అలా అంటే గతంలో కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్‌లపై ఎన్నిసార్లు రాజద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్, బి‌జే‌పి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.