బీజేపీతో పొత్తుపై లోకేష్ లాజిక్‌లు..ముస్లిం ఓట్లపై ఫోకస్!

-

ఏపీలో పొత్తు ఎవరెవరి మధ్య ఉంటుంది? వచ్చే ఎన్నికల్లో పొత్తు ఏ పార్టీల మధ్య ఉంటుందనే అంశాలపై ఇంకా క్లారిటీ రాని విషయం తెలిసిందే. అయితే వైసీపీని గద్దె దించాలంటే టి‌డి‌పి-జనసేన కలవాల్సిన పరిస్తితి. కాకపోతే జనసేన..బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి రెడీగా లేదు. కానీ బి‌జే‌పిని కలుపుకుని టి‌డి‌పితో కలవాలని పవన్ చూస్తున్నారు.

ఇక జనసేనతో పాటు బి‌జే‌పి కలిస్తే కేంద్రం మద్ధతు దొరుకుతుందనేది చంద్రబాబు ఆలోచన. కానీ జనసేన ఓకే గాని బి‌జే‌పితో పొత్తు వద్దు అనేది టి‌డి‌పి కార్యకర్తల ఆలోచన. ఇలా పొత్తుపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తాడిపత్రిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..ముస్లింలకు అనుబంధంగా ఉండే దూదేకుల వర్గంతో సమావేశమయ్యి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో వారి నుంచి లోకేష్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. బి‌జే‌పితో పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకుంటే తాము ఓట్లు వేయాలా? వద్దా? అని లోకేష్ ని ప్రశ్నించారు. దీనికి లోకేష్ లాజికల్ గా సమాధానం ఇచ్చారు.

Nara Lokesh

గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి తాము మద్దతిచ్చినా ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఈసారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే ముస్లింలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేశామని, నాగుల్ మీరాను పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ చేసిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తుచేశారు. కానీ వైసీపీ బీజేపీతో అంటకాగుతున్న సమయంలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, మిస్బా అనే పదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుందని ఫైర్ అయ్యారు. అంటే టి‌డి‌పి…బి‌జే‌పితో పొత్తుకు రెడీగా ఉందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news