విజయవాడలో లోకేష్ పాదయాత్ర..వైసీపీ బిగ్ స్కెచ్.!

-

లోకేష్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది..అయితే పాదయాత్ర సక్సెస్ కాకుండా వైసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందా? గన్నవరంలో భారీ సభ ఉన్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేలా స్కెచ్ వేస్తుందా? అందుకే సి‌ఎం జగన్ తాజాగా విజయవాడ వచ్చి..దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళారా? అంటే అవుననే అంటున్నారు టి‌డి‌పి నేత బుద్దా వెంకన్న..లోకేష్ పాదయాత్రని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని, అడ్డుకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు.

అయితే లోకేష్ పాదయాత్ర మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ ద్వారా విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుంది. మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తారు. విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, పెనమలూరు లతో పాటు గన్నవరంలో పాదయాత్ర చేస్తారు. చివరిగా గన్నవరంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాదయాత్రని సక్సెస్ చేయడానికి కృష్ణా జిల్లా తమ్ముళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇదే సమయంలో తాజాగా విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ని ప్రారంభించడానికి వచ్చిన జగన్..దేవినేని అవినాష్ ఇంటికెళ్లారు. అక్కడ కాసేపు అవినాష్ ఫ్యామిలీతో ముచ్చటించారు.

పాదయాత్ర అడ్డుకునే కుట్రలో భాగంగా జగన్, అవినాష్ ఇంటికెళ్లారని బుద్దా ఆరోపిస్తున్నారు. లోకేష్ పాదయాత్రను, గన్నవరంలో బహిరంగ సభకు ఆటంకపర్చాలని కుట్ర జరుగుతోందని, దానిలో భాగంగానే ఇరువురు భేటీ జరిగిందని, అసలు ఎప్పుడో ప్రారంభించిన హోటల్‌ని మరోసారి సీఎం ఓపెన్ చేయటం ఏంటి అని బుధ్దా ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా మా పాదయాత్రను అడ్డుకోవాలని చూసిన, ఇబ్బందులు కలిగించాలని చూసిన దీటైన జవాబు ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.

జగన్ పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని అన్నారు. చూడాలి మరి విజయవాడ,గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version