మల్లారెడ్డికి ఐటీ షాక్..సంచలన విషయాలు..టెన్షన్‌లో గులాబీదళం.!

-

తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ నేతల లక్ష్యంగానే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాలతో పాటు, టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, కుమారుడు ఇళ్ళల్లో ఐటీ సోదాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటి సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కేటాయించిన సీట్లను కోటాలో కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌లపై ఉన్న బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలిస్తోంది. అలాగే మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ కూడా సీజ్ చేశారని తెలిసింది. అటు మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.

ఇదిలా ఉంటే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. తాటాకు చప్పుళ్ళకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని, దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు.

ఇక ఐటీ రైడ్స్ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ నేతలకు సూచించారు. అయితే పైకి ఎంత చెప్పిన టీఆర్ఎస్ నేతల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. ఐటీ, ఈడీ దాడులతో టీఆర్‌ఎస్‌ నేతల్లో అలజడి మొదలైంది. ఈ దాడులని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అత్యవసర సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు దీనిపై భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి ఇళ్ళు, ఆఫీసులపై జరుగుతున్న ఐటీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news