టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్న హరీశ్ రావు

-

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఇక రాష్ట్రం మొత్తం తిరగనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయనకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో త్వరలోనే భాగస్వామ్యం కానున్నారు..

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎట్టేకేలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు చోటు దక్కింది. ఇదివరకు రిలీజయిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం హరీశ్ రావు అభిమానులను బాధించినా.. తర్వాత ఆయనకు చోటు దక్కడంపై హరీశ్ రావు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

MLA harish rao gets listed in trs star campaigners

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ రావుకు చోటు కల్పించారు. దానికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది.

MLA harish rao gets listed in trs star campaigners

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, సెక్రటరీ జనరల్ కేశవరావు, ప్రధాన కార్యదర్శలు సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, బండా ప్రకాశ్, రవీందర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ పంపించింది. అయితే.. వాళ్లలో హరీశ్ రావు పేరు లేదు. తర్వాత ఈరోజు సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ రావు పేరును చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news