ఆ ఐదు జిల్లాల ఎమ్మెల్యేలకే రిస్క్…!

-

అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. గతేడాది కాలం నుంచి కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని, పలు సర్వేల్లో వెల్లడవుతుంది. అలాగే వైసీపీ అంతర్గత సర్వేల్లో, పీకే టీం సర్వేలో కూడా ఇదే వాస్తవమని తేలిందని తెలుస్తోంది. అందుకే జగన్ కూడా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని ఓపెన్ గానే చెప్పేశారు.

అంటే వ్యతిరేకత లేకపోతే జగన్ ఈ మాట చెప్పరు. కానీ ఎమ్మెల్యేలని మారుస్తానని చెప్పారంటే.. ఖచ్చితంగా వ్యతిరేకత ఉండే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరిపై ఎక్కువ వ్యతిరేకత ఉందనేది పూర్తిగా బయటకు రావడం లేదు. కొందరు ఎమ్మెల్యేల పేరులు బయటకొస్తున్నాయి.. గాని పూర్తి స్థాయిలో మాత్రం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనేది తెలియడం లేదు. ఇదే క్రమంలో వ్యతిరేకత ఎదురుకుంటున్నవారిలో ఐదు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

ఆ ఐదు జిల్లాల్లోనే వైసీపీకి పెద్ద దెబ్బ తగలవచ్చని అంటున్నారు. పైగా ఆ ఐదు జిల్లాల్లో టీడీపీతో పాటు జనసేన బలం కూడా పెరిగిందని తెలుస్తోంది. అలా వైసీపీలో వ్యతిరేకత ఎక్కువ ఉన్న ఎమ్మెల్యేలు.. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నారని తెలిసింది. ఈ జిల్లాల్లోనే ఎక్కువ స్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు జిల్లాలు కలిపి మొత్తం 82 సీట్లు ఉన్నాయి.. ఇందులో టీడీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక టీడీపీ-జనసేన నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళినవారు 4 గురు ఉన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో సగంపైనే ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేల్లో తేలింది. వీరి పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం కష్టమని తెలుస్తోంది. దీని వల్ల వైసీపీ గెలుపుకు ఇబ్బంది అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news