మోదీ వర్సెస్ కేసీఆర్: వేడెక్కిన ‘రాజకీయం’!

-

ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ..మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్…ఇద్దరు నేతలు అనూహ్యంగా పోటీ పడే సమయం ఆసనమైంది…అదేంటి ప్రధానికి, సీఎంకు పోటీ ఏంటి అనుకోవచ్చు..అదే తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్…ఇప్పటివరకు ఇద్దరు నేతాలూ సఖ్యతతోనే ఉన్నట్లు కనిపించారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ రేసులోకి వచ్చిందో అప్పటినుంచి కేసీఆర్ స్ట్రాటజీ మార్చారు…అసలు రాష్ట్రంలోని బీజేపీని టార్గెట్ చేయకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మొదట ధాన్యం కొనుగోలు వ్యవహారంతో మొదలైన రచ్చ…ఇప్పుడు మరింత పీక్స్ లోకి వెళ్లింది.

పైగా తెలంగాణ బీజేపీ నేతలు…ఊహించని విధంగా కేసీఆర్ ప్రభుత్వంపై మాటల దాడి పెంచారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాజకీయం హీటెక్కిస్తూ వస్తున్నారు. ఇలా తమని టార్గెట్ చేయడంతో..కేసీఆర్ కూడా వ్యూహం మార్చి…కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు…ఇక మోదీ ప్రభుత్వం అనుసరించే విధానాలని తప్పుబట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని మాట్లాడుతూ వచ్చారు. ఇటు ఏమో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని బీజేపీ చూస్తుంది.

ఇలా రెండు పార్టీల మధ్య వార్ మొదలైంది…ఈ వార్ కాస్త ఇప్పుడు తీవ్ర స్థాయికి వెళ్లింది. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ..జాతీయ కార్యవర్గ సమావేశాలని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు..దీనికి ప్రధాని మోదీతో పాటు..కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. అలాగే విజయ్ సంకల్ప్ పేరిట భారీ సభని ఏర్పాటు చేయనున్నారు.

ఇక బీజేపీకి కౌంటర్ గా టీఆర్ఎస్ సైతం…హైదరాబాద్ కు వస్తున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసింది. అంటే ఒకే రోజు హైదరాబాద్ లో అటు మోదీ, ఇటు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ షురూ కానుందని చెప్పొచ్చు. మొత్తానికి టీఆర్ఎస్-బీజేపీల దూకుడుతో తెలంగాణ రాజకీయం ఓ రేంజ్ లో వేడెక్కిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news