బాబు, బాలయ్యల త్యాగాలు కోరుతున్న చినబాబు!

చినబాబు నారా లోకేష్ గత కొన్ని రోజులుగా కాస్త బలంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే! రాజకీయాలు జనాల్లో ఉండి చేయాలి తప్ప ఆన్ లైన్ లో కాదని అర్ధం అయ్యిందో ఏమోకానీ ఇదేపనిలో ఉన్నారు చినబాబు! మంచిదే… కానీ, ఇప్పటికీ ఆయనకు మంగళగిరి నియోజకవర్గం కొట్టిన దెబ్బ మాత్రం మరుపురావడం లేదంట! దాంతో… చంద్రబాబు – బాలయ్యల్లో ఒకరిని త్యాగం చేయమని అడుగుతున్నారంట!

అవును… 2019 సార్వత్రిక ఎన్నికల్లో చినబాబుకు తగిలిన దెబ్బ మామూలుది కాదు! ఒక్క ఓటమి రెండు విమర్శలను తెచ్చి పెట్టింది. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ ని గతంలో మంత్రిని చేశారు.. ఇది లోకేష్ రేంజ్ అని కాగా… కొడుకుని కూడా గెలిపించుకోలేని అసమర్ధుడిగా బాబుకు విమర్శ మిగిలింది! కాబట్టి… ఇకపై ఇటువైపు చూడకపోవడమే బెటరని చినబాబు ఆలోచిస్తున్నారంట.

అందులో భాగంగా 2024 కంటే ముందే ఎన్నికలు వస్తాయనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… అయితే హిందూపుర్ లేకపోతే కుప్పం లలో పోటీచేయాలని చినబాబు ఆలోచిస్తున్నారంట. బాలయ్య నియోజకవర్గం హిందూపురం లో టీడీపీ నుంచి ఎవరు నిల్చున్నా గెలుస్తారని ఒక నానుడి! కాబట్టి అదైతేనే సేఫ్ జోన్ అని చినబాబు భావిస్తున్నారంట. లేకపోతే గత మూడున్నర దశాబ్ధాలుగా వారి చేతిలోనే ఉన్న కుప్పం నుంచి పోటీచేయాలని ఆలోచిస్తున్నారంట.

ఇదే సమయంలో మరో ఆలోచన కూడా చేస్తున్నారంట చినబాబు! ఎందుకైనా మంచిది కాబట్టి… రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తే మరీ మంచిదనే ఆలోచన కూడా ఉందంట! అయితే అది కూడా సీమ ప్రాంతం అయితేనే సేఫ్ అనే భయానికి చినబాబు పడిపోయారంట! మరి నాన్న గారు చేస్తారా.. మామ గారు చేస్తారో తెలియదు కానీ… ఇద్దరిలో ఒకరైతే త్యాగం చేయాలనేది చినబాబు కోరిక. మరి ఎవరు తీరుస్తారో చూడాలి!!