ఖమ్మంకు ఎన్టీఆర్..కారుకు అడ్వాంటేజ్.!

-

ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. మళ్ళీ ప్రజా మద్ధతు కూడబెట్టుకుని మూడోసారి గెలిచి అధికారం సొంతం చేసుకోవడం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్‌పై 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, దాన్ని ప్రారంభించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడంపై పెద్ద చర్చ జరుగుతుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే విజయవాడలో చంద్రబాబు, రజనీకాంత్, బాలయ్య ఆధ్వర్యంలో శత జయంతి అంకురార్పణ జరిగింది. అయితే ఆ సభ రాజకీయంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. రజనీకాంత్..ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుని పొగడటం పై వైసీపీ పెద్ద ఎత్తున రజనీపై విమర్శలు చేసింది. ఆయన్ని కూడా దారుణంగా తిట్టారు. అలా వైసీపీ నేతలు..రజనీని తిట్టడాన్ని తప్పుబడుతున్నారు. ఇక ఆ అంశం ఇప్పుడుప్పుడే చల్లారుతుంది.

ఈ అంశం పక్కన పెడితే..ఇప్పుడు ఖమ్మంలో భారీ స్థాయిలో ఏర్పాటు  అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిషర్కించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. మే 28న జూనియర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో పాటు..సుప్రీం కోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్ రమణ కూడా రానున్నారు.

అయితే ఇలా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరగడంపై చర్చ నడుస్తోంది..బి‌ఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా ఖమ్మంలో లబ్ది పొందడానికి ఎన్టీఆర్ పేరుతో స్కెచ్ వేసిందని అంటున్నారు. జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ, అటు కమ్మ వర్గం ప్రభావం ఉంది. వారిని తమ వైపు తిప్పుకోవడానికి బి‌ఆర్‌ఎస్ పార్టీ వేసిన ప్లాన్ ఇది అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version