ప్రభుత్వం ఏర్పడక ముందే వ్యతిరేక స్వరమా..?

-

ఏపీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమికి ప్రభుత్వం ఏర్పడక ముందే వ్యతిరేకత ఏర్పడుతుంది. చంద్రబాబు స్వార్థాన్ని చూసుకుంటున్నారంటూ వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. ఎన్‌డీఏ కూటమి సమావేశానికి వెళ్లిన చంద్రబాబు, పవన్ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా ఊసే ఎత్తకపోవడంతో విమర్శులు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించే టీడీపీ కూటమి.. ఇంత మంచి అవకాశాన్ని వదులుకుందంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.


ఏఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలంటే..తమకు మూడు కేంద్రమంత్రి పదవులు, సహాయక మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఏపీలో ప్రభుత్వం ఏర్పడక ముందే చంద్రబాబుపై కొన్ని వర్గాల్లో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. ఇంతటి అవకాశం దక్కినా వినియోగించుకోలేకపోతే చంద్రబాబు అంత చేతకాని నేత ఎవరూ ఉండరంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మైనారిటీ రిజర్వేషన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత కీలకంగా మారుతున్నాయి. మైనారిటీలకు రిజర్వేషర్లు ఉంటాయని.. వాటిని కొనసాగించే బాధ్యత తనదని ఎన్నికల ప్రచారం పలుమార్లు చంద్రబాబు చెప్పారు. అదే విధంగా వైసీపీ అమలు చేసిన( కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా బోగస్ అని, అది ప్రజల ఆస్తులను దోచుకునే చట్టమని చంద్రబాబు చెప్పారు. ఈ రెండు అంశాల్లో బీజేపీ, టీడీపీ మధ్య వ్యతిరేక దృక్పథాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పడు ఆంధ్రలో మైనారిటీ రిజర్వేషన్ల కొనసాగింపుకు అంగీకరించకపోతే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యథాతథంగా కొనసాగించాలంటే చంద్రబాబు నిర్ణయం ఏంటి? ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తారా? లేదంటే అలాగే కొనసాగుతారా ? అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి?

Read more RELATED
Recommended to you

Exit mobile version