టీడీపీ-జనసేన పొత్తుపై రకరకాల అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కలిసినప్పుడు ఆ రెండు పార్టీలు మధ్య పొత్తు ఖాయమనే పరిస్తితి. కానీ తర్వాత ఎవరికి విడిగా రాజకీయం చేయడం..తమని సిఎం చేయాలని కోరడం..తమ ప్రభుత్వం వస్తుందని చెప్పడంతో..టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఉండదనే డౌట్ వస్తుంది. ఇలా కన్ఫ్యూజన్ ఉంది. పొత్తుపై కన్ఫ్యూజన్ ఉంది గాని..చంద్రబాబు, పవన్ మాత్రం క్లారిటీగానే ఉన్నట్లు సమాచారం.
ఇద్దరు ఎత్తిపరిస్తితుల్లోనూ పొత్తు దిశగానే వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే పొత్తుపై ఇప్పుడు వైసీపీని మాత్రం కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఎన్నికల ముందు పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయం..ఇక సీట్ల పంపకాలు అప్పుడే తేలనున్నాయి. ఇక జనసేనకు టిడిపికి ఎన్ని సీట్లు వదులుతుందో ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ పొత్తు ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జనసేన కోసం సీట్లు టిడిపి నేతలు త్యాగం చేయాలి. అప్పుడు త్యాగం చేసిన టిడిపి నేతలు జనసేన గెలుపు కోసం ఎంతవరకు పనిచేస్తారో తెలియదు.
అయితే ఇక్కడ పవన్ అదే విషయంపై డౌట్ గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో టిడిపికి బలం ఉంది. జనసేనకు అలా లేదు. దీని వల్ల జనసేనకు కేటాయించే సీట్లలో టిడిపి ఓట్లు ఎంతవరకు బదిలీ అవుతాయో చెప్పలేని పరిస్తితి. అలా ఓట్లు బదిలీ కాకపోతే జనసేనకే ఇబ్బంది. దీన్ని ముందుగానే గుర్తించిన పవన్..మొదట జనసేన సొంతంగా బలపడేలా స్కెచ్ వేస్తున్నారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన సొంత బలాన్ని పెంచుకుంటుంది.ఒకవేళ టిడిపి ఓట్లు బదిలీ కాకపోతే జనసేనకు భారీ నష్టం జరుగుతుంది. దీని వల్ల పొత్తుకు ఇబ్బంది. అందుకే పవన్..తమకు ఏ ఏ సీట్లు దక్కుతాయని అనుకుంటున్నారో..ఆ సీట్లలో సొంత బలాన్ని పెంచుకుంటున్నారు.