జగన్ బిగ్ డెసిషన్..పవన్ కోసం బలమైన ప్రత్యర్ధి.!

-

రాజకీయ పరంగా వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో జగన్ రూటే వేరు అని చెప్పాలి. రాజకీయాల్లో ఎవరి వ్యూహామని అర్ధమవుతుంది. కానీ జగన్ వ్యూహం అర్ధం కావడం కష్టం..అది అర్ధమయ్యే లోపు అంతా అయిపోతుంది. ఆ స్థాయిలో జగన్ వ్యూహాలు ఉంటాయి. ఇక ఈ సారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఆయన ఊహించని వ్యూహాలతో ముందుకొస్తున్నారు.

ఇదే క్రమంలో బలమైన ప్రత్యర్ధులని ఓడించడానికి ఊహించని ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ని, లోకేష్‌ని ఓడించడానికి జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో తెలిసిందే. కాపులని తమవైపుకు తిప్పుకుని..టి‌డి‌పి, జనసేన మధ్య ఓట్ల చీలికతో పవన్ గాజువాక, భీమవరంల్లో ఓడిపోయారు. ఇటు మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. ఈ సారి లోకేష్ మంగళగిరి బరిలోనే దిగుతున్నారు. దీంతో అక్కడ జగన్ అదిరే వ్యూహాలు రెడీ చేశారు. ఇప్పటికే అక్కడ మెజారిటీగా ఉన్న చేనేత వర్గం ఓట్లని వైసీపీ వైపుకు తిప్పుతున్నారు.

అలాగే ఈ సారి లోకేష్ పై బీసీ అభ్యర్ధిని నిలబెట్టే యోచన చేస్తున్నారు. తాజాగా మంగళగిరి పరిధిలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చి..అక్కడ కొత్త ఓటర్లు వచ్చేలా చేశారు. ఇలా మంగళగిరిలో మళ్ళీ పై చేయి సాధించే విధంగా జగన్ ప్లాన్ చేశారు. కాకపోతే ఈ సారి పవన్ ఎక్కడ పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన భీమవరంలో పోటీ చేస్తారా? మరో సీటుకు మారతారా? అనేది తెలియడం లేదు.

అయితే జనసేన వర్గాల సమాచారం ప్రకారం పవన్..భీమవరంలోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పవన్‌ని ఓడించడానికి జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్ధిని బరిలో దించాలని చూస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే వీక్ గా ఉంటే, ఆ ఎమ్మెల్యేని మార్చేయాలని చూస్తున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేతనే పవన్ పై పోటీకి దింపాలని ప్లాన్ చేశారని తెలిసింది. అది కూడా కాపు నేతనే పెడతారని తెలిసింది. చూడాలి మరి జగన్ వ్యూహాలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news