వారాహితో పవన్ రెడీ..ఎన్నికల రంగంలోకి!

అతి త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేయడానికి పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్ర చేయడానికి పూర్తి టెక్నాలజీ హంగులతో వారాహి బస్సుని రెడీ చేసిన విషయం తెలిసిందే. ఈ బస్సుకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఏపీలో అధికార వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు చెక్ పెడుతూ..పవన్ వారాహి బస్సుతో కదన రంగంలోకి దూకడానికి రెడీ అయ్యారు.

ఇదే క్రమంలో తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం తెలిపారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్.. వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాధికాలుతో వారాహికి ప్రత్యేక పూజలను పూర్తి చేశారు. దీంతో వారాహితో పవన్ ఎన్నికల రంగంలో దిగనున్నారు.

కొండగట్టులో పవన్ కోసం అభిమానుల రద్దీ

అయితే బస్సు యాత్ర ఎప్పుడు చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రత్యేకంగా ఇంకా షెడ్యూల్ రాలేదు. అదే సమయంలో పవన్ బస్సు యాత్రకు వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు పలు ఆంక్షలతో పర్మిషన్ ఇచ్చినట్లు, పవన్ బస్సు యాత్రకు కూడా ఆంక్షలు విధిస్తారా? అనేది చూడాల్సి ఉంది. అయితే లోకేష్ పాదయాత్రకు రోడ్లపై సభలు పెట్టకూడదని ఆంక్షలు పెట్టారు. దీంతో బస్సు యాత్ర చేసే పవన్‌కు రోడ్లపై సభలు పెట్టుకోవాల్సిన పరిస్తితి ఉంటుంది. అలా కాకుండా వేరే ఆంక్షలు ఏమైనా విధిస్తారా? పవన్‌కు ఆంక్షలు ఏమైనా సడలింపులు ఉంటాయా? అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి వారాహితో బస్సు యాత్రకు పవన్ రెడీ అవుతున్నారు.