జగన్‌కు కొత్త తలనొప్పులు..సీన్ మారిపోయిందిగా!

-

ఏపీలో అధికార వైసీపీకి ఈ మధ్య అన్నీ వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు స్థానిక ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్‌గా విజయాలు దక్కడంతో అసలు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జగన్‌కు కొత్త తలనొప్పులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అటు జనసేన సైతం దూకుడు పెంచింది. ఇక చివరికి బీజేపీ కూడా వైసీపీపై దాడి పెంచింది. ఆ పార్టీ కూడా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది.

Jagan
Jagan

దీనికి తోడు టీడీపీ-జనసేనలు కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బీజేపీలోకి వెళ్ళి, వైసీపీకి చెక్ పెట్టనున్నారని కథనాలు వస్తున్నాయి. ఇక ఇటు వస్తే జగన్ సోదరి షర్మిల ఏపీలో పార్టీ పెట్టడంపై సంచనల వ్యాఖ్యలే చేశారు. ఆమె ఎప్పుడు పార్టీ పెడుతుందో అర్ధం కాకుండా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే…సొంత పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి కనిపిస్తోంది. దీని వల్ల వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.

ఇక జగన్‌కు వ్యతిరేకంగా కాపులంతా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వంగవీటి రాధా ఎపిసోడ్‌తో సీన్ మారింది. కాపు నేతలంతా ఒకచోట చేరి జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇదొక తలనొప్పి అనుకుంటే తాజాగా మరో తలనొప్పి మొదలైంది. ఇటీవల వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై…మరో వైసీపీ నేత దాడి చేసిన విషయం తెలిసిందే.

అయితే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఈ సమస్య చల్లబడింది అనుకుంటే…తాజాగా గుప్తా, వంగవీటి రాధాని కలిశారు. ఇక ఆయనతో ఏం చర్చించారో ఎవరికి క్లారిటీ లేదు. పైగా వైశ్యులతో ఒక సభ పెట్టారు. వారు జగన్ ప్రభుత్వానికి యాంటీ అయ్యేలా చేస్తున్నారు. ఇలా అన్నీ రకాలుగా జగన్‌కు తలనొప్పులు పెరిగిపోయాయి. ఇలా ప్రతిదీ జగన్‌కు వ్యతిరేకంగా మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news