పదవులకు “ముత్యం”- ముత్యాల నాయుడు 

-

తెలుగు నాట రాజకీయాల్లో అతని పేరు పెద్దగా సుపరిచితం కాదు . కానీ గ్రామ స్ధాయి వార్డు మెంబర్ నుండి నేడు దక్కించుకున్న ఉపముఖ్యమంత్రి పదవి వరకు   “ పదవులకు “ అతను సుపరిచితం. నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తెలుగు నాట ఏ రాజకీయ నాయకుడికి లేని ఓ అరుదైన రికార్డు ఆ అతిసామాన్య వెనుకబడిన వర్గాల నాయకుడు , మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు సొంతం .
పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఉన్న పదవులలో ఓటమి అనేది లేకుండా ….
1988 -1995 వరకు పంచాయితీ వార్డు మెంబర్ గా , ఉప సర్పంచ్
1995 -2001 వరకు సర్పంచ్
2001 -2006 ZPTC, జిల్లా పరిషత్ స్ధాయి సంఘ సభ్యుడు
2006- MPTC
2008-2011 వరకు MPP
2014 – MLA
2019- MLA ,Gov Whip
2022- పంచాయితీ రాజ్ మంత్రిగా , ఉపముఖ్యమంత్రిగా
****************
ఇక పార్టీ పదవులలో కూడా మూములు ట్రాక్ రికార్డు కాదు ముత్యాల నాయుడిది .
1981- రాజీవ్ గాంధీ గ్రామ యువజన సంఘ అధ్యక్షుడు
1984- మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
1991 – రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రచార దళ్ జాయింట్ కన్వీనర్
2001 -మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
2003- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
2012-2014 వరకు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త .
2014 నుండి మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా , శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా , అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యునిగా , బీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా పనిచేసారు .
1994,1999,2004,2009 లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా టికెట్ కోసం అలుపెరగకుండా ప్రయత్నించి విఫలమైనా..మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రాజకీయాలలో కొనసాగుతూ ..వైసీపీలో చేరి తన కల నెరవేర్చుకున్నారు.
2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత  అప్పటి అధికార పార్టీ  ‘గేలం’ వేసినా రూట్ మార్చని ముత్యాల నాయుడు వైసీపీనే నమ్ముకొని ఉపముఖ్యమంత్రి వరకు ఎదిగిన క్రమం నాకు సుపరిచితం. 2014 ఎన్నికల తర్వాత  ఆర్ధికంగా , ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులు ఎదురైనా మౌనంగా తన పని తాను చేసుకుపోతూ ముందుకెళ్లిన ముత్యాల నాయుడు   గ్రామ స్థాయి నుండి రాజకీయంగా , పాలనా పరంగా తనకున్న అనుభవంతో ఉపముఖ్యమంత్రిగా , పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి మంత్రి గా ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే .
@ Durga ,Sr .Jouranlist

Read more RELATED
Recommended to you

Exit mobile version