పొత్తుల పవన్: తెలంగాణలో ట్విస్ట్ ఇస్తారా?

-

సినిమాల్లో పవన్ కల్యాణ్ పవర్ స్టార్ అయితే.. రాజకీయాల్లో మాత్రం వేరే వాళ్ళకు పవన్ ఇచ్చే నాయకుడుగా ఉండిపోయారు. అసలు రాజకీయాల్లో పవన్ పేరు చెబితే పొత్తులే గుర్తొస్తున్నాయి. అసలు ఆయన సొంతంగా ఒక పార్టీని నడుపుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు..తమ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా సరే ఈ టాపిక్ లు ఏవి కూడా పెద్దగా చర్చకు రావు. ఎంతసేపు పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..ఎవరికి అనుకూలంగా మాట్లాడతారు అనే అంశాలే ఎక్కువ చర్చకు వస్తాయి.

ఇటీవల చాలా ఎక్కువగా పొత్తుల అంశం తెరపైకి వస్తుంది. ఇప్పటికే పవన్ పలు రకాలుగా పొత్తులు పెట్టుకుంటూ వచ్చారు. జనసేన పార్టీ పెట్టిన మొదట్లో టీడీపీ-బీజేపీలతో కలిసి పనిచేశారు…తర్వాత సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు…మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నారు..ఇక నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో కూడా కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతో పొత్తు మాత్రం తప్పనిసరిగా ఉండటం ఖాయమని అర్ధమవుతుంది. పైగా పవనే చెబుతున్నారు…వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను అని..అంటే ఆయన పొత్తు కోసం రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. సరే ఇదంతా ఏపీలో రాజకీయం.

అయితే ఈ మధ్య పవన్..తెలంగాణ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా తిరుగుతున్నారు…కాకపోతే అక్కడ కూడా పవన్ పొత్తుతో ముందుకు వస్తున్నారని ప్రచారం మొదలైంది. సరే ఎలాగో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి..అక్కడ కూడా అదే పార్టీతో పొత్తులో ముందుకెళ్తారని అంతా అనుకోవచ్చు…కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అసలు తెలంగాణలో పవన్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే అంశం గురించి చర్చలు జరగడం లేదు.

అక్కడ అధికార టీఆర్ఎస్ పట్ల పవన్ సానుకూలంగా ఉన్నారు…కాబట్టి ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతుంది. అంటే పవన్ రాజకీయం కేవలం పొత్తుల కోసమే అన్నట్లు ఉంది..మరి చివరికి ఎవరితో కలిసి ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news