రాయలసీమ గడ్డ..ఎవరి అడ్డా..?

-

రాయలసీమ గడ్డ..గత రెండు ఎన్నికలుగా వైసీపీ అడ్డాగా ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. ఆ పార్టీని ఓడించడం అంత సులువు కాదు. కానీ అక్కడ పాగా వేయాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర జరిగింది. ప్రస్తుతం కడపలో పాదయాత్ర జరుగుతుంది. లోకేష్ పాదయాత్రకు ప్రజా స్పందన పర్లేదు. అయితే లోకేష్ రాయలసీమలో టి‌డి‌పికి మంచి విజయాన్ని కట్టబెట్టాలని చెప్పి..అక్కడ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నారు.

మిషన్ రాయలసీమ అంటూ..టి‌డి‌పి అధికారంలోకి వస్తే సీమ రూపురేఖలు మారుస్తామని..తాగునీరు, సాగునీరు అందిస్తామని, కంపెనీలు తీసుకొస్తామని యువతకు ఉపాధి కల్పిస్తామని..గత ఎన్నికల్లో వైసీపీకి 49 సీట్లు ఇచ్చారని, కానీ ఏం చేసింది లేదని, కాబట్టి తమకు 49 సీట్లు ఇస్తే తమ అభివృద్ధి ఏంటో చూస్తారని అంటున్నారు. అయితే లోకేష్ టార్గెట్ బాగానే ఉంది..గాని అది రీచ్ అవ్వడం అంత తేలిక కాదు. వైసీపీని దాటి టి‌డి‌పి ఆధిక్యం సాధించడం కష్టం.

గత ఎన్నికల్లో 52 సీట్లకు వైసీపీ 49, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టి‌డి‌పి బలం పెరిగిన మాట వాస్తవం కానీ..వైసీపీ ఆధిక్యాన్ని దాటలేదు. ఇప్పటికీ అక్కడ వైసీపీకే ఆధిక్యం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో టి‌డి‌పికి 20 సీట్ల వరకు బలం కనిపిస్తుంది. అటు వైసీపీకి 30 పైనే సీట్లలో బలం ఉంది. కాబట్టి సీమలో వైసీపీదే ఆధిక్యం ఉంది.

ఎన్నికల నాటికి కూడా ఈ పరిస్తితి మారే అవకాశం లేదు. ఇక్కడి ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతారు. పైగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కోరుకుంటున్నారు. ఇటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. దీని వల్ల చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి మంచి ఆధిక్యం వస్తుంది. అనంతపురంలో వైసీపీ,టి‌డి‌పిల మధ్య పోటీ ఉంటుంది. ఏదేమైనా రాయలసీమ గడ్డ..వైసీపీ అడ్డా అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news