జగన్‌పై బాబు పైచేయి…అసలు ట్విస్ట్ ఏంటంటే?

గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి జగన్‌కు ఎలాగోలా చెక్ పెట్టాలని చంద్రబాబు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి సి‌ఎం అయిన చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్కసారిగా 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఇక ఆ తర్వాత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్‌ని బద్నామ్ చేయడానికి చద్రబాబు కిందా మీదా పడుతున్నారు. ప్రతి అంశలోనూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

Nara-Chandrababu-Naidu
Nara-Chandrababu-Naidu

జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉండే పలు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దెబ్బకొట్టడానికి చూస్తున్నారు. ఇక చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా సైతం జగన్ ప్రభుత్వంపై ఎలాంటి కథనాలు ఇస్తుందో చెప్పాల్సిన పని లేదు.

అసలు జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనే స్థాయిలో టి‌డి‌పి, దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారానికి తోడు ఈ మధ్యన వస్తున్న పలు సర్వేలు సైతం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో కొన్ని వర్గాల ప్రజల్లో జగన్ పని అయిపోయిందనే విధంగా ప్రచారం వెళుతుంది. ఇక జగన్‌పై చంద్రబాబు పైచేయి సాధించారనే విధంగా విశ్లేషణలు కూడా మొదలైపోయాయి.

కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే…టి‌డి‌పి వర్గాలు చేస్తున్న ప్రచారం ప్రకారం జగన్‌పై బాబు పైచేయి సాధించినా….అసలు ప్రజల్లో మాత్రం ఇంకా జగన్‌దే పైచేయిగా ఉందని తెలుస్తోంది. దానికి కారణం కేవలం జగన్ సక్సెస్ ఫార్ములా…సంక్షేమం. ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్య తరగతి ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఈ పథకాలు ఆర్ధికంగా వారికి సపోర్ట్‌గా ఉంటున్నాయి. దీని వల్ల మెజారిటీ ప్రజలు ఇంకా జగన్ వైపే ఉన్నారు.