రేవంత్ డిసైడ్ చేసేశారు…ఈటల గెలుపు లాంఛనమేనా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు ఎవరిదో….టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పేసినట్లే కనిపిస్తోంది. మొదట నుంచి హుజూరాబాద్ ఉపఎన్నికపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ రేసులో లేదని అర్ధమైపోతుంది. ఈటల రాజేందర్ ఎఫెక్ట్‌తో ఉపఎన్నిక పోరు మారిపోయింది. ఈటల-టి‌ఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధాన ఫైట్ జరుగుతుందని జనమంతా అనుకుంటున్నారు….ఇక ఆ విషయాన్ని రేవంత్ కూడా పరోక్షంగా అంగీకరించి, ఉపఎన్నికపై ఫోకస్ పెట్టలేదు. అందుకే బలమైన అభ్యర్ధిని కూడా నిలబెట్టలేదని ప్రచారం కూడా నడుస్తోంది.

revanth reddy etela rajender

కాకపోతే అభ్యర్ధిని ప్రకటించారు కాబట్టి…ప్రచారం చేయడానికి మాత్రం రేవంత్ సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా కూడా ఉపఎన్నిక గురించి రేవంత్ కామెంట్ చేశారు. టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలు ఒక్కటే అనే కోణంలో ప్రచారం చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే అని మాట్లాడారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్‌కు ప్రమాదమని, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని అన్నారు.

ఇక్కడ హరీష్ బకరా అంటే….హుజూరాబాద్‌లో గెలుపు కష్టమనే చెప్పి కే‌సి‌ఆర్…హరీష్‌కు బాధ్యతలు అప్పగించారని చెప్పొచ్చు. అక్కడ ఓడిపోతే హరీష్‌కే నెగిటివ్ అవుతుంది. అప్పుడు కే‌టి‌ఆర్‌ని సి‌ఎం చేయడానికి ఇంకా సులువు అవుతుంది. అటు ఈటల గెలిస్తే బండికి, కిషన్ రెడ్డికి ఇబ్బంది అని అంటున్నారు. అంటే పరోక్షంగా ఈటల గెలవబోతున్నారని రేవంత్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. లేకపోతే ఈటల గెలిస్తే వల్ల ఇద్దరికీ ప్రమాదం అని చెప్పాల్సిన అవసరం ఏముంది.

అయితే టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల గురించి మాట్లాడుతున్నారు గానీ, ఖచ్చితంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని మాత్రం రేవంత్ మాట్లాడటం లేదు. మొదట నుంచి రేవంత్ అదే వైఖరితో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ రేవంత్ టార్గెట్ కాంగ్రెస్ గెలవడం కాదు…టి‌ఆర్‌ఎస్ ఓడిపోవడం అని తెలుస్తోంది. అంటే ఈటల గెలుపు అని క్లియర్ గా అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news