తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు.. ఎప్పుడెప్పుడు విస్తరణ జరుగుతుందా.. తమకు ఆమాత్య యోగం ఎప్పుడు దక్కుతుందా అని సీనియర్ ఎమ్మెల్యేలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. క్యాబినెట్ విస్తరణ ఖాయమనే ప్రచారం తెలంగాణాలో జరుగుతూ ఉంటుంది.. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పిలుపొచ్చింది..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. పీసీసీ చీప్ మహేష్ గౌడ్ తో కలిసి ఆయన అక్టోబర్ 17న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు..
సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై రాష్ట్ర నేతల్లో ఆశలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రేవంత్ ఢిల్లీ బాట పట్టడంతో మళ్లీ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి పర్యటనతో కేబినెట్ విస్తరణపై క్లారిటీ రాబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలల కావోస్తోంది.. అప్పటి నుంచి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని.. సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు.. ఈ క్రమంలో శ్రావణమాసం లోపు మంత్రివర్గంలోకి కొత్త మంత్రులు చేరుతారని అందరూ అనుకున్నారు.. కానీ అది జరగలేదు.. దసరా కల్లా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికే హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడేందుకే.. పార్టీ పెద్దలు రేవంత్‌ను ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనతో విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 16 సాయంత్రం ఆయన డిల్లీకి వెళ్లబోతున్నారు.. సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం.. తెలంగాణ విషయాలను చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు..ఈ మీటింగ్లోనే విస్తరణపై క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ నడుస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి ఈసారైనా కొత్త మంత్రుల లిస్ట్ తో వస్తారో లేదో చూడాలి..