అక్కడే బండికి మైనస్..అదే రేవంత్‌కు ప్లస్..

-

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. నెక్స్ట్ ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించేయాలని రెండు పార్టీలు చూస్తున్నాయి. అయితే కేసీఆర్‌కు చెక్ పెట్టడానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ కంటే, కాంగ్రెస్‌ పార్టీనే బలం పెంచుకునేలా కనిపిస్తోంది.

bandi sanjay kumar revanth reddy
bandi sanjay kumar revanth reddy

మొన్నటివరకు బీజేపీనే, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని అంతా అనుకున్నారు. అలాగే రాజకీయం కూడా నడిచింది. కానీ అనూహ్యంగా రేవంత్‌కు పీసీసీ పదవి వచ్చాక రాజకీయాలు మారిపోయాయి. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. అలాగే బండిని డామినేట్ చేస్తూ రేవంత్ ముందుకెళుతున్నారు. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్‌పైన పోరాటం చేస్తూనే, బీజేపీకి ఉన్న మైనస్‌లని రేవంత్ ప్లస్‌గా మార్చుకుంటున్నారు.

అయితే బీజేపీకి ఉన్న మైనస్‌లు ఏంటంటే…కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుల అంశాలపై ప్రజలు, కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇక రాష్ట్రం విధించే పన్నులపై కూడా అసంతృప్తిగా ఉన్నారు. అటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. దీని వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో ఈ అంశాలపై పోరాటం చేయలేదు.

కానీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఇప్పుడు అదే రేవంత్‌కు ప్లస్ అవుతుంది. పైగా రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయడంలో కూడా బీజేపీ ఫెయిల్ అయింది. ఈ పరిణామాలు బీజేపీకి బాగా మైనస్ అవుతాయనే చెప్పొచ్చు. అందుకే తెలంగాణలో ఎదిగేందుకు రేవంత్‌కు మంచి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news