స్లోగన్ పాలిటిక్స్: సాలు దొర..సెలవు దొర!

రాజకీయాల్లో స్లోగన్స్ అనేవి చాలా ప్రభావం చూపుతాయనే చెప్పొచ్చు. రాజకీయంగా ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి లేదా…తాము సొంతంగా బలపడటానికి పార్టీలు స్లోగన్స్ ఎక్కువ వాడుతాయి. ఈ స్లోగన్స్ పాలిటిక్స్…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే…2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి బాబు వస్తేనే జాబు అనే నినాదం బాగా ఉపయోగ పడింది. అలాగే 2019లో కావాలి జగన్-రావాలి జగన్, బై బై బాబు అనే స్లోగన్స్ వైసీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి.

ఇక ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి కొన్ని స్లోగన్స్ వాడుతుంది…’మళ్ళీ నువ్వే రావాలి’ ‘క్విట్ జగన్-సేవ్ ఏపీ’ అనే నినాదాలు అందుకుంది. ఇది ఏపీలో జరిగే రాజకీయం..అయితే ఈ మధ్య తెలంగాణలో కూడా స్లోగన్స్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పై తీవ్రమైన రాజకీయ యుద్ధం చేస్తున్న బీజేపీ…సరికొత్త స్లోగన్ తో ముందుకొచ్చింది. ‘సాలు దొర-సెలవు దొర’ అనే స్లోగన్ తెరపైకి తెచ్చింది. కల్వకుంట్ల కౌంట్ డౌన్ పేరుతో “సాలు దొర – సెలవు దొర” అంటూ బీజేపీ ఆఫీసులో డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా, ఏకంగా ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించి టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.

ఇక ఈ ‘స్లోగన్’ని బీజేపీ నేతలు ప్రతిరోజూ వాడుతూ..టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి కౌంటర్ గా టీఆర్ఎస్ సైతం…’సాలు మోదీ-సంపకు మోదీ’ అనే స్లోగన్ అందుకుంది. కానీ బీజేపీ అంత ఎఫెక్టివ్ గా టీఆర్ఎస్ చేయలేకపోతుంది. బీజేపీ స్లోగన్ ప్రజల్లోకి ఎక్కువ వెళ్లింది. పైగా బండి సంజయ్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదొక సమస్యని ప్రస్తావిస్తూ..సాలు దొర, సెలవు దొర అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే బండి సంజయ్ ప్రత్యేకంగా సమస్యలని పైకి తీసుకొచ్చి స్లోగన్ వాడటం వల్ల అది జనాల్లోకి ఎక్కువ వెళుతుంది…మరి ఈ స్లోగన్ బీజేపీకి ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.