ఆ మంత్రులపై వేటు తప్పదా? సీన్‌లోకి నానీలు.!

-

మరోసారి ఏపీ మంత్రివర్గంలో మార్పులు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మామూలుగా అయితే ఇంకా మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేవు….కానీ ఇటీవల జగన్…మంత్రులపై చేసిన కామెంట్స్ వల్ల…మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు అనే ప్రచారం నడుస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు దారుణంగా ఫెయిల్ అవుతున్నారని, టీడీపీ ఆరోపణలని తిప్పికొట్టాలని, అలా చేయని పక్షంలో మంత్రి పదవుల నుంచి తప్పించడానికి కూడా వెనుకాడనని జగన్ …కేబినెట్ సమావేశంలో చెప్పుకొచ్చారు.

ఇక జగన్ క్లాస్ తీసుకున్నాక…మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు బూతులు కూడా తిట్టేశారు. అయితే ఇంకా కొందరు…చంద్రబాబుని తిట్టడంలో వెనుకబడి ఉన్నారు. కొందరు మంత్రులు పెద్దగా మీడియా ముందు కూడా కనిపించడం లేదు. అలాగే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియడం లేదు. అలాంటి వారిని జగన్ నవంబర్‌లో మార్చేస్తారేమో అని టాక్ నడుస్తోంది.

చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో బాగా వెనుకబడి ఉన్నవారిలో..పినిపే విశ్వరూప్, విడదల రజిని, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, బూడి ముత్యాలనాయుడు, తానేటి వనిత..ఇలా కొందరు మంత్రులు ఉన్నారు..అసలు వీరిలో కొందరు మీడియా ముందు కనబడటమే తక్కువ..ఇంకా అలాంటప్పుడు బాబుపై విమర్శలు చేయడం కూడా ఉండదు. కాబట్టి వీరిలో కొందరిపై వేటు పడుతుందని చర్చ నడుస్తోంది.

ఇదే క్రమంలో మాజీ మంత్రులైన సరే పేర్ని నాని, కొడాలి నానిలు మాత్రం తమదైన శైలిలో బాబుని తిడుతూనే ఉన్నారు..వారు మాజీలైన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో వారిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది…మరి ఈ సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news