కంచుకోటని నాశనం చేస్తున్న తమ్ముళ్ళు!

ఓ వైపు చంద్రబాబు..టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతుంటే…మరోవైపు తమ్ముళ్ళు..తమ సొంత గొడవలతో పార్టీని ఇంకా నాశనం చేస్తున్నారు…ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే…అయితే చంద్రబాబు ఏదొక విధంగా తమ్ముళ్ళకు సర్దిచెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్నారు. కానీ బాబు మాటలని కొందరు తమ్ముళ్ళు లెక్క చేయడం లేదు…ఎవరికి వారు ఆధిపత్యం కోసం..బలంగా ఉండే నియోజకవర్గాల్లో సైతం పార్టీని నాశనం చేస్తున్నారు.

ఇదే క్రమంలో కంచుకోటగా ఉన్న మాడుగులలో సైతం టీడీపీని తమ్ముళ్లే దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ ఏం చేయకుండానే…సొంత వాళ్లే నాశనం చేసేస్తున్నారు. మామూలుగా మాడుగుల టీడీపీకి కంచుకోట….2009 వరకు మంచి విజయాలే అందుకుంది…కానీ 2014 నుంచి సీన్ మారిపోయింది…2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు గెలిచారు. ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు.

అయితే నిదానంగా ఇక్కడ వైసీపీకి వ్యతిరేక పరిస్తితులు మొదలవుతున్నాయి…మరీ పూర్తి స్థాయిలో కాదు గాని…గత ఎన్నికల్లో ఉన్నంత అనుకూలత ఇప్పుడు మాడుగులలో వైసీపీకి లేదు. ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీకి బలపడే అవకాశాలు ఉన్నాయి. కానీ మంచి అవకాశాల్ని కూడా తమ్ముళ్ళు నాశనం చేస్తున్నారు. ఆ మధ్య ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కన పెట్టి…పీవీజీ కుమార్ ని ఇంచార్జ్ గా పెట్టారు.

ఇంచార్జ్ గా వచ్చాక కుమార్ బాగానే పనిచేసుకుంటూ వస్తున్నారు…కానీ రామానాయుడు మాత్రం పదవి పోయాక ఇంకా సెపరేట్ గా రాజకీయం నడుపుతూ..కుమార్ కు చెక్ పెట్టే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే గ్రూపు రాజకీయాన్ని నడుపుతున్న రామానాయుడుకు బాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది..కుమార్ కు సహకరించాలని కూడా కోరినట్లు సమాచారం..కానీ రామానాయుడు అలా చేయడం లేదు…ఇప్పటికీ సెపరేట్ వర్గ పోరుని పెంచుతూ…నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలతో కంచుకోట లాంటి మాడుగులలో టీడీపీ దెబ్బతింటుంది..ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ గెలవడం కష్టమే.