ఫేక్ సర్వేలు: సైకిల్‌కు జాకీలు.!

-

అసలే జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పరిస్తితి అధఃపాతాళానికి పడిపోయింది. వరుసగా టి‌డి‌పికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది..అటు వైసీపీ కూడా తిరుగులేని ప్రజాభిమానాన్ని చూరగొంది. కానీ టి‌డి‌పి పరిస్తితి ఇంకా దిగజారుతూనే వస్తుంది. ఇక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి..జైలు పాలయ్యారు. ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలోనే నడిపించే నాయకుడు లేక టి‌డి‌పి మరింత ఇబ్బందుల్లోకి వెళ్లింది.

నాయకులు సైలెంట్ అయ్యారు..నడిపించే నాయకుడు లేక కేడర్ దిక్కులు చూస్తుంది. అంటే ఇంకా టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ టి‌డి‌పిపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని, మద్ధతు పెరిగిందని బాబు భజనపరులు, సొంత మీడియా హైప్ ఇస్తుంది. ఇది మాటల్లో తప్ప చేతల్లో లేదు. అందుకే ప్రజలు నమ్మడం లేదు..దీంతో సర్వేల రూపంలో టి‌డి‌పి ఆట మొదలుపెట్టింది. అదిగో టి‌డి‌పి బలం పెరిగిపోయిందని కొన్ని ఫేక్ సర్వేలు వదులుతున్నారు. ఇప్పటికే ఓ సర్వే టి‌డి‌పి అధికారంలోకి వచ్చేస్తుందని హల్చల్ చేసింది.

లోకల్ సర్వే నమ్మకపోవడంతో జాతీయ సర్వే పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు. అది ఏంటంటే ఇండియా టీవీ-సి‌ఎన్‌ఎక్స్ పేరిట విడుదలైన సర్వేలో వైసీపీ 46 శాతం ఓట్లతో 15 ఎంపీ సీట్లు..టి‌డి‌పి 42 శాతం ఓట్లతో 10 సీట్లు వస్తాయని సర్వే చెప్పిందని టి‌డి‌పి నేతలు చెప్పుకుంటున్నారు. అసలు జాతీయ స్థాయిలో ఏ సర్వే చూసిన 25కి 25 ఎంపీ సీట్లు వైసీపీనే గెలుస్తుందని సర్వేలు వస్తున్నాయి.

రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ టి‌డి‌పి కేడర్ లో ధైర్యం నింపడానికి టి‌డి‌పి అధిష్టానం ఇలాంటి ఫేక్ సర్వేలకు తెరలేపినట్లు కనబడుతుంది. అసలు టి‌డి‌పికి ఉన్న ముగ్గురు ఎంపీలు తప్ప..మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులే లేరు. అటు అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా ఇంచార్జ్‌లు కూడా లేరు. ఎక్కడా చూసిన జగన్ గాలి ఎదురుకోలేమని తెలుగు తమ్ముళ్ళు చేతులెత్తేస్తున్నారు. కానీ ఇలాంటి ఫేక్ సర్వేలు వేసి సైకిల్‌కు జాకీలు వేసి లేపేందుకు టి‌డి‌పి భజనపరులు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version