గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో దాదాపు 99.5 శాతం హామీలు అమలు చేశామని..ఇంకా 0.5 శాతం కూడా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని జగన్ ప్రతి సభలోనూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే 99.5 శాతం హామీలు అనేది పూర్తి అవాస్తవం అని..వాస్తవ పత్రం అంటూ..టిడిపి జగన్ కోతలు పెట్టిన హామీలు, అమలు చేయని హామీలు ఇవే అంటూ టిడిపి చెబుతుంది. తాజాగా మీడియాకి టిడిపి నేతలు జగన్ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు.
చెప్పిన మేరకు చేయని హామీలు 39 ఉన్నాయని, జగన్ రెడ్డి మోసపు లీలలు పేరుతో తెలుగుదేశం వాస్తవ పత్రాన్ని విడుదల చేసింది. రైతు భరోసా కింద రూ.13500 ఇస్తానని చెప్పి ఇచ్చేది రూ.7500 మాత్రమే అని తెలిపారు. ఫించన్ల పెంపు కింద ఇచ్చిన మూడు హామీల్లో రెండు అమలుకాలేదని, అమ్మఒడి కింద ఇచ్చిన రెండు హామీల్లో రెండూ అమలు కాలేదని.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని అన్నారు. తీర అమలులో ఒకరికే ఇస్తున్నారు..అది కూడా 80 లక్షల తల్లులు ఉంటే..40 లక్షల మందికే రూ.15 వేలు కాకుండా 13 వేలు ఇస్తున్నారని అన్నారు.
పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని, మద్యనిషేధం అంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలుకాలేదని, ఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన నాలుగు హామీల్లో నాలుగు పెండింగ్‌లోనే ఉన్నాయని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
అయితే జగన్ మేనిఫెస్టోలో దాదాపు అన్నీ హామీలు అమలు చేసే దిశగానే వెళ్లారు..కాకపోతే కొన్ని పథకాలలో కోతలు విధించారు. మద్యపాన నిషేధం అనేది అడ్రెస్ లేదు. రైతు భరోసా మొదట రూ.12,500 ఇస్తానని అన్నారు. అంటే కేంద్రం ఇచ్చే 6 వేలు కలుపుకునే రూ.18,500 అవ్వాలి..కానీ తీరా మొత్తం 13,500 వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తుంది. ఇలా పలు హామీల్లో కోతలు ఉన్నాయి..అందుకే జగన్ 99.5 మేనిఫెస్టో మోసమని టిడిపి అంటుంది.