జగన్ పై షాకింగ్ ట్వీట్ చేసిన టీడీపీ ఎంపీ…!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ పై పలు రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలు శాసన మండలిని రద్దు ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేస్తారు అనే ప్రశ్న పలువురు వేసారు. తీర్మానం చేసారు సరే అది సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ నేపధ్యంలో విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని నాని ట్వీట్ చేసారు. “జగన్ అన్నా నువ్వూ నీ ముఠా వైసీపీ పార్టీ 1.అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కధల్చలేరు. 2.హైకోర్టు ను అమరావతి నుండి మార్చలేరు. 3.శాసనమండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు .” అని ట్వీట్ చేసారు.

దీనితోపాటు 2013 డిసెంబర్ 13న ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన తన ట్వీట్‌లో పోస్ట్ చేసారు. దేశంలో శాసనమండళ్లు ఏర్పాటు చేయడం లేదా రద్దు చేయడం అనే అంశాలపై ఓ జాతీయ విధానం ఉండాలంటూ గతంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు తమ ఇష్టానుసారంగా మండళ్లను రద్దు చేసుకుంటూ పోవడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడింది. రాజస్థాన్‌లో శాసనమండలి ఏర్పాటుకు ఆ కమిటీ ఓకే చెప్పింది.