తిరుపతిలో రూటు మార్చిన టీడీపీ..ర్యాలీలు, సభలు లేకుండా సరికొత్త ప్రచారం

Join Our Community
follow manalokam on social media

తిరుపతిలో ఎలాగైనా జెండా ఎగరేయాలని టీడీపీభావిస్తోంది. ఆ దిశగా ఈసారి రూటు మార్చింది. సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.. గతానికి భిన్నంగా ముందుకు సాగుతోంది. గతంలో నిర్వహించిన విధంగా ర్యాలీలు, సభల పేరుతో హడావుడి చేయకుండా కొత్త వ్యూహానికి పదును పెట్టింది టీడీపీ. క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తోందంట.పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు టీడీపీ సీనియర్లంతా ఈ తరహా ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

తిరుపతి పార్లమెంటు గెలుపు కోసం టిడిపి కోత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది..గతంలో నిర్వహించిన విధంగా ర్యాలీలు, సభల పేరుతో హడావుడి చేయకుండా సైలెంట్ గా క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది..ముఖ్యంగా ఓటర్లకు పార్టీ స్టాండ్ వినిపించడంపై ఫోకస్ పెట్టింది. బూత్‌ కమిటీ వ్యవస్థను బలోపేతం చేయడంపై పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. అధికార పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లు బాగా ఉపయోగపడ్డారని భావించిన టీడీపీ..దీనికి ప్రత్యమ్నాయంగా బూత్‌ కమిటీ వ్యవస్థను నిర్మించింది.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బూత్ కమిటీలు దూకుడు తగ్గించాయి. దీంతో స్థానిక నాయకత్వానికి సహకరించడానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. అందరికీ బాధ్యతలు అప్పగించి..గత పదిహేను రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, క్రియాశీలక కార్యకర్తలు ఇలా అందరూ తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. నెల రోజులుగా అందరూ అక్కడే ఉంటూ పరిస్థితి సమీక్ష చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

టీడీపీ నేతలు బూత్ కమిటీల సాయంతో ఓటర్లతో మమేకం అవుతున్నారు. డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు.. మరోవైపు సేవ్ తిరుపతి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే పథకాల పేరుతో వాలంటీర్లు బెదిరించే అవకాశం ఉందని.. అలా ఎవరైనా బెదిరిస్తే వారి సమచారాన్ని పార్టీకి అందించాలని వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

టీడీపీ గతంలో సభలు,సమావేశాలతో హోరెత్తించిన ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు..ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఉప ఎన్నికల్లో ఖర్చుపెట్టాడానికి నేతలు ముందుకు రాకపోవడం ఈ కొత్త వ్యూహాన్ని నమ్ముకున్నారు తెలుగు తమ్ముళ్లు. నారా లోకేష్ సైతం 10 రోజులుగా తిరుపతి మకాం వేసినా.. బహిరంగ సభలు ఎక్కడ లేకుండా ప్రచారానికి అధిక ప్రధాన్యం ఇస్తున్నారటా. మరోవైపు వైసీపీ,బిజెపి మాత్రం పాదయాత్రలు,బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. రూటు మార్చిన టీడీపీకి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...