టీడీపీ, జనసేన పైశాచికానందం… జర్నలిస్టులపై అసభ్యకరమై పోస్టులు

-

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగుదేశం, జనసేన పార్టీల పైశాచికానందం బయటపడుతుంది.ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోతోంది. ఇరు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, అనుకూలమైన వ్యక్తులు ఒక మహిళా జర్నలిస్టును సైతం వ్యక్తిత్వహననానికి పాల్పడే స్థాయికి దిగజారిపోయారు.టీవీ9 మహిళా జర్నలిస్టు హసీనాపై సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోలింగ్ చేసేశారు.ఈ ట్రోలింగే ఈ రెండు పార్టీల వ్యవహార శైలిని బట్టబయలు చేస్తోంది.తన స్వార్ధం కోసం,అధికార పార్టీపైన బురద చల్లేందుకు బాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.

అసలు ఈ ట్రోలింగ్ కి కారణం ఏమిటంటే….తెలుగు వారి సంప్రదాయ వేడుక సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ9 ప్రత్యేక ప్రోగ్రామ్ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని మోటార్ బైక్‌పై కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన దుష్ప్రచారం చేసేస్తున్నారు పచ్చ బ్యాచ్.మహిళా జర్నలిస్టు అనే కనీస ఆలోచన లేకుండా హసీనాపై దారుణమైన, అసభ్యకరమై పోస్టులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారు.

మీడియాలో ఇలాంటి కార్యక్రమాలు కొత్తేం కాదు.జర్నలిస్టు అంటే సామాన్యుడి దగ్గర్నించి సెలబ్రిటీల వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు.ప్రోగ్రామ్‌లో భాగంగా అలా చేస్తే దాన్ని కూడా వక్రీకరించి ఆమెను మోరల్‌గా దెబ్బతీసి పైశాచికానందం పొందుతోంది పచ్చ బాచ్.
జర్నలిజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకరమైన, దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
హసీనా ప్లేస్‌లోబ్వారి చెల్లెలో, బంధువులో ఉంటే ఇలాగే చేస్తారా? అనేది పచ్చ బ్యాచ్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version