తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక భేటీ జరనుంది. ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని పరిస్థితులు, సభ్యత్వ నమోదుపై రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి వివరించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా రాహుల్ గాంధీని కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్త గళాలు పెరుగుతున్నాయి. జగ్గారెడ్డి వంటి కొంత మంది నేరుగా టీపీసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్లు రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. పార్టీలో అసంత్రుప్త నేతలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యచరణ గురించి వివరించే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ సభపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉంది.