తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం నివాసం ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగనుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో నేడు కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ఆమోదం కోసమే కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 2022-23 కు సంబంధించి బడ్జెట్ ను ఆమోదం తెలుపనుంది కేబినెట్. రేపు ఉభయ సభల్లో రెండింటిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ లోని అంశాలను మంత్రులకు వివరించనున్నారు కేసీఆర్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ లోని అంశాలను మంత్రులకు వివరించనున్నారు. దీంతో పాటు విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. వారికి ధీటుగా ఎలా బదులివ్వాలనే దానిపై మంత్రులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నారు. దీంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా మంత్రులతో పంచుకోనున్నారు.