భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఓ ఎమ్మెల్యే చేజారినట్లిగానే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం ఒక ఎత్తయితే.. ఏకంగా బీఆర్ఎస్ అధినేత నిర్వహించిన వేశానికి డుమ్మ కొట్టడంతో భద్రాచలం ఎమ్మెల్యే చేజారినట్లుగానే ప్రచారం జరుగుతోంది.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే టికెట్ పొంది గెలుపొందారు. కానీ, మొదటి నుంచీ బీఆర్ఎస్కు దూరంగా ఉంటూనే వస్తున్నారు. పొంగులేటి సైతం తెల్లం వెంకట్రావు తన వెంటే ఉన్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్నారు.
రెండు రోజుల క్రితం తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు.
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన రివ్యూ మీటింగ్ హాజరుకాకపోవడం, ఇటీవలనే ముఖ్యమంత్రిని సైతం కలవడంతో కారు దిగుతున్నట్లు పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ, పార్టీ మారితే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అనధికారికంగా కాంగ్రెస్‌తో కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.