కమలంలో సీఎం రేసు లేనట్లేనా?

-

రాజకీయాల్లో ఏ నాయకుడి లక్ష్యమైన ఒకటే…అత్యున్నత పదవిని సాధించడం. రాజకీయాల్లో అత్యున్నత పదవులు కొన్నే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి..కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి. అయితే రాష్ట్రం విషయానికొస్తే…ఎవరైనా సరే మంత్రి కావాలని ఆశపడతారు. అలాగే జాతీయ పార్టీల్లో ఉండే బడా నేతలు సీఎం పదవి ఆశిస్తారు.

ఇక ఈ విషయంలో తెలంగాణలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల్లో…సీఎం పదవి ఆశించే వారు ఎక్కువగానే ఉన్నారు. టీఆర్ఎస్ ఎలాగో ప్రాంతీయ పార్టీ కాబట్టి అందులో అయితే సీఎం కేసీఆర్…లేదంటే కేటీఆర్. కానీ కాంగ్రెస్, బీజేపీలో అలా కాదు. జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి సీఎం ఎంపిక ఉంటుంది..అందుకే సీఎం రేసులో ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే…బీజేపీలో సీఎం రేసులో పలువురు నేతలు ఉన్నారు. పైకి చెప్పకపోయినా సరే….కొందరు తమకు సీఎంగా ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటారు. అలాగే పార్టీని ముందుండి నడిపించడానికి చూస్తారు.

ప్రస్తుతం కమలంలో సీఎం రేసులో ఉన్న పేర్లు వచ్చి…కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, వివేక్. అయితే ఇందులో ముఖ్యంగా ఈటల, కిషన్ రెడ్డి, సంజయ్ లు సీఎం రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల ఈటల రాజేందర్ సీఎం అభ్యర్ధి అంటూ కథనాలు వస్తున్నాయి.

ఇక దీనిపై ఈటల క్లారిటీ ఇచ్చేశారు…తాను సీఎం అభ్యర్ధిని కాదని అన్నారు… అలాగే బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నేతలు.. కార్యకర్తలు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నారు. తనను సీఎం అభ్యర్థిగా పలు పత్రికలు.. ఛానళ్లు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇక ఈటల ఇచ్చిన క్లారిటీ బట్టి చూస్తే అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వారే సీఎం అవుతారని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు ఇప్పుడే సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. కేసీఆర్ ని గద్దె నుంచి దింపి… తెలంగా గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో నేతలు పనిచేస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక…అప్పుడు సీఎం పదవి రేసులో పోటీ పడేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news