ఏదేమైనా అధికార పార్టీని ఉపఎన్నికల్లో ఓడించడం అనేది మామూలు విషయం కాదు..ఎందుకంటే ఉపఎన్నికల్లో అధికార పార్టీకే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం…అధికార పార్టీకి చెక్ పెట్టే మరీ రెండు ఉపఎన్నికల్లో గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టింది. మధ్యలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సత్తా చాటింది. ఇలా అధికార పార్టీని ఓడించిన బీజేపీ….అంతగా సక్సెస్ మాత్రం అవుతున్నట్లు కనిపించడం లేదు. గెలిచినా సరే బీజేపీ రాజకీయంగా సక్సెస్ కావడం లేదు.
అదేంటి గెలుపు ఒక సక్సెస్ అనుకోవచ్చు…కానీ వచ్చిన గెలుపులు నాయకులని బట్టి వచ్చాయి గానీ పార్టీ బట్టి రాలేదు. అంటే రాజకీయంగా ఇంకా బలపడాల్సి ఉంటుంది. ఇలాంటి గెలుపులు వచ్చినప్పుడు రాజకీయంగా బలపడటానికి మంచి ఛాన్స్. కానీ ఆ ఛాన్స్ బీజేపీ పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే హుజూరాబాద్‌లో గెలిచాక…బీజేపీలో ఒక్క నాయకుడు చేరలేదు. ఇతర పార్టీల నుంచి వలసలు లేవు. అసలు ఈటలతోనే ఈ వలసలు ఆగిపోయాయి.
పోనీ గెలుపు వచ్చాకైనా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు…కానీ అనుకున్న మేర మాత్రం బండి సంజయ్…ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లు లేరు. ఎందుకంటే హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకోకుండా చూస్తే….రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీకి అంత బలం లేదు.
టీఆర్ఎస్ పూర్తి బలంతో ఉంది..ఆ తర్వాత కాంగ్రెస్‌కు బలం ఉంది…ఆ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక…కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కానీ గెలుస్తున్న బీజేపీలో మాత్రం నాయకులు చేరడం లేదు. అంటే గెలిచినా…బీజేపీ సక్సెస్ కాలేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఈటలని బీజేపీ వాడుకోవాలి…ఆయనకు లీడ్ ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఆయనకు టీఆర్ఎస్‌లోని నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో అసంతృప్తిగా ఉన్న నాయకులని లాగాలంటే ఈటలని ముందుపెట్టాలి. బీజేపీ మాత్రం ఆ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే గెలిచినా…సక్సెస్ మాత్రం కావడం లేదు.