ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్ట్‌లు..ఇంకా ఎవరు?

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే..ఎవరికి వారే అధికారాలని ఉపయోగించుకుని ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీ, సి‌బి‌ఐలు..లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వారిన విచారిస్తుంది..అలాగే వ్యాపారాలు చేస్తున్న టీఆర్ఎస్ నేతల టార్గెట్ గా ఐటీ, ఈడీ రైడ్స్ నడుస్తున్నాయి. అటు క్యాసినో వ్యవరహాన్ని కూడా వదలడం లేదు.

ఇక ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ చేస్తున్నారు..ఈ క్రమంలోనే పలువురికి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఈ కేసులో కీలక పాత్ర ఉన్న తుషార్‌కు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. నవంబర్ 21వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా.. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో తుషార్ మాట్లాడినట్లుగా అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉంటే అనూహ్యంగా సిట్.. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడైన శ్రీనివాస్‌ అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజీకి విమానం టికెట్లు శ్రీనివాసే బుక్ చేశాడనే ఆరోపణలు రావటంతో.. అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణని సిట్ వేగంగా జరుపుతుంది..అయితే రానున్న కాలంలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కానీ పూర్తిగా బీజేపీని ఇరికించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ముందుకెళుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి నోటీసులు ఇచ్చారు..మరి నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో కీలకమైన బీజేపీ నేతల పేర్లు కూడా బయటకొస్తాయా? లేదా? అనేది చూడాలి.