up elections: ఎంఐఎం పోటీ బీజేపీకి కలిసి వచ్చింది.. ఎలాగో తెలుసా..?

-

అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ పోటీ వల్ల బీజేపీకి యూపీలో కలిసి వచ్చింది. చాలా స్థానాల్లో ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమికి పడాల్సిన ఓట్లను ఎంఐఎం చీల్చింది. దీంతో బీజేపీ చాలా చోట్ల విజయం సాధించింది. ఎస్పీ విజయం ఖాయం అనుకున్న చోట్లలో ఎంఐఎం ఆ పార్టీ కొంపముంచింది. యూపీలో 200 ఓట్ల తేడాలో 7 సీట్లు, 500 ఓట్ల తేడాలో 23 సీట్లు, 1000 ఓట్ల తేడాతో 49 సీట్లు, 2000 ఓట్ల తేడాతో 86 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇటు వంటి స్థానాల్లో ఎంఐఎం బీజేపీ గెలుపొందిన తేడా కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. ఫలితంగా బీజేపీ విజయం సాధించింది. 

ఉదాహరణకు బిజ్నోర్ నియోజకవర్గంలో ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమికి 95,720 ఓట్లు వస్తే, ఎంఐఎం 2290 ఓట్లు సాధించింది. బీజేపీ 97165 ఓట్లను సాధించి ఆ స్థానాన్ని గెలుచుకుంది. అక్కడ 1445 ఓట్ల ఆధిక్యతతో బిజ్నోర్ ని గెలుచుకుంది. నకూర్‌లో బీజేపీకి 1,03,771 ఓట్లు రాగా, ఎస్పీకి 1,03,616 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 3,591 ఓట్లు రావడంతో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే విధంగా బారాబంకిలోని కుర్సీ స్థానంలో బీజేపీకి 1,18,614 ఓట్లు రాగా, ఎస్పీకి 1,18,094, ఎంఐఎంకు 8,541 ఓట్లు వచ్చాయి. సుల్తాన్ పూర్ లో బీజేపీకి 92245 ఓట్లు రాగా… ఎస్పీకి 90,857 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎంఐఎంకి 5,251 ఓట్లు వచ్చాయి. జౌరాయ్ నియోజకవర్గంలో బీజేపీకి 93691 ఓట్లు రాగా.. ఎస్పీకి 92,044 ఓట్లు రాగా, ఎంఐఎంకు 2,190 ఓట్లు వచ్చాయి. ఈ  స్థానాల్లో ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమి ఓట్లను ఎంఐఎం చీల్చడంతో బీజేపీ గెలుపు సులువు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news