జనసేన పార్టీలో చేరడానికి చిరంజీవి ఆసక్తి కనబరచలేదు. ఒక్క నాగబాబు మాత్రం పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
మెగా ఫ్యామిలీ అటాచ్ మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంటర్నల్ గా వాళ్లకు ఎన్ని సమస్యలు ఉన్నా.. బయట మాత్రం మెగా ఫ్యామిలీ బాగుంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరో ఒకరు ఆదుకుంటారు. వాళ్లలో వాళ్లు కలుపుగోలుగా ఉంటారు. ఒకరికి మరొకరు సాయపడుతుంటారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ కూడా పోటీ చేస్తారేమోనని… ప్రచారం కూడా చేస్తారని.. మెగా సినీ గ్లామర్ కాస్తో కూస్తో ఎన్నికల్లో తోడవుతుందని అంతా అనుకున్నారు.
అయితే.. జనసేన పార్టీలో చేరడానికి చిరంజీవి ఆసక్తి కనబరచలేదు. ఒక్క నాగబాబు మాత్రం పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే.. నాగబాబుకు అంత సినీ గ్లామర్ లేదు. ఆయనకు ఓట్లు రాలడం కష్టమే. అందుకే తెలుగు స్టార్ హీరో రామ్
చరణ్ రంగంలోకి దిగారట.
ఆయన రీసెంట్ గా పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారట. ఇద్దరు కలిసి దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారట. మరి.. వారిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు. ఇంకో మూడు రోజులే ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. మరి.. ఈ మూడు రోజులు ప్రచారం చేస్తారు? అనేదానిపై స్పష్టత లేదు.
జనసేన మేనిఫెస్టోకు కూడా రామ్ చరణ్ మద్దతు పలికారు. పవన్ కోసం రామ్ చరణ్ భీమవరంలో ప్రచారం చేస్తారని.. అలాగే గాజువాక, తర్వాత నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం లో కూడా ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే.. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండగా… ఇప్పుడు రామ్ చరణ్ ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందా అన్న అనుమానం ఏపీ ప్రజల్లో మొదలైంది. ఆయన ప్రచారం ఓటర్లను ప్రభావితం చేస్తుందా? అంటే కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.