నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తుంది. మళ్ళీ అధికారం నిలబెట్టుకుని సత్తా చాటాలని చూస్తుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ గెలుపు సులువు కాదు. టిడిపి బలపడుతుంది..అటు జనసేనతో టిడిపి పొత్తు దెబ్బతీయవచ్చు. అనేక రకాల సమీకరణాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే వైసీపీ పక్కా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్న గాలితో సంబంధం లేదు..అభ్యర్ధుల బలాబలాలు పక్కన పెట్టేసి..ఇంకా కళ్ళు మూసుకుని అక్కడ వైసీపీనే గెలుస్తుందనే స్థానాలు కొన్ని ఉన్నాయట.
ఇటీవల కొన్ని సర్వేల్లో వైసీపీ డౌట్ లేకుండా గెలిచే సీట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అలాగే వైసీపీ డౌట్ లేకుండా గెలిచే సీట్లలో..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట, పాలకొండ సీట్లు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, సాలూరు సీట్లు. అటు విశాఖలో అరకు, పాడేరు, మాడుగుల సీట్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, అనపర్తి సీట్లు..ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం.
ఇక కృష్ణా లో గుడివాడ, నూజివీడు, గన్నవరం, పామర్రు సీట్లు. గుంటూరులో మాచర్ల, నరసరావుపేట. ప్రకాశం జిల్లాలో చీరాల, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు సీట్లు. అటు నెల్లూరులో..సర్వేపల్లి, ఆత్మకూరు సీట్లు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, మదనపల్లె స్థానాలు పక్కాగా గెలుస్తుందట.
కడపల..రైల్వేకోడూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు, జమ్మలమడుగు, కడప, కమలాపురం సీట్లలో గెలుపు ఖాయం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, పాణ్యం, కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు, శ్రీశైలం స్థానాల్లో వైసీపీకి తిరుగులేదట. అనంతపురంలో..మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి సీట్లు పక్కాగా గెలుస్తుందట. అంటే ఇవన్నీ 100 శాతం గెలిచేవి..ఇంకా కొన్ని సీట్లలో వైసీపీకి లీడ్ ఉంది..టఫ్ ఫైట్ ఉన్న సీట్లు ఉన్నాయి. ఇలా అన్నీ చూసుకుంటే వైసీపీకి దాదాపు 100 పైనే వస్తాయని తెలుస్తుంది.