జగన్ కష్టం..వైసీపీ లైట్..బాబుపై బేస్.!

-

రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలని, అప్పుడే పేద ప్రజలకు మంచి జరుగుతుందని జగన్ చెబుతున్నారు. పైగా పూర్తిగా కసితో రగులుతున్న టి‌డి‌పి గాని అధికారంలోకి వస్తే  ఎలాంటి పరిస్తితి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఆ దిశగానే జగన్ కష్టపడుతున్నారు.

కానీ జగన్ కష్టం మీద ఆధారపడే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప..సొంతంగా గెలవాలని చూసేవారు చాలా తక్కువే. మళ్ళీ జగన్ గాలి ఉంటే గెలిచేస్తామని ధీమాతో ఉన్నారు తప్ప..పార్టీ కోసం ప్రజల్లో తిరిగి మళ్ళీ బలం పెంచుకుని గెలవాలని చూస్తున్న నేతలు తక్కువగానే కనిపిస్తున్నారు. పైగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కదా..ఇంకా తమకు తిరుగుండదని భావిస్తున్నారు. అంటే బాబు అరెస్ట్ మీద బేస్ అయ్యి..ఇంకా తమకు అడ్డు ఉండదని అనుకుంటున్నారు. అందుకే వైసీపీ నేతలు సైతం బాబు అరెస్ట్ తర్వాత పెద్దగా ప్రజల్లో తిరుగుతున్నట్లు కూడా కనిపించడం లేదు.

ఓ వైపు టి‌డి‌పి నేతలు బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా జనసేన నిలుస్తుంది. ఆ రెండు పార్టీలు ఏదొక విధంగా ప్రజల్లో కనిపిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు పెద్దగా కనిపిస్తున్నట్లు లేరు. ఇటీవలే జగన్ సైతం ఎమ్మెల్యేలు ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క నేత ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

అయితే వైసీపీ నేతలు అనుకున్న విధంగా ప్రజల్లోకి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు కొన్ని చోట్ల ముగించేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైసీపీకి నష్టం తప్ప..లాభం ఉండదు. కేవలం జగన్ కష్టం మీదా, బాబు అరెస్ట్ అయిపోయారనే అంశాలపైనే ఆధారపడి ఉంటే వైసీపీకి డ్యామేజ్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news