జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై యథావిధిగా వైసీపీ నేతలు విమర్శల పర్వం మొదలుపెట్టారు. తాజాగా ఆయన భీమవరం సభలో జగన్ ప్రభుత్వం టార్గెట్ గా పలు ప్రశ్నలు వేశారు…అలాగే తన వ్యక్తి జీవితం గురించి మాట్లాడే జగన్‌కు సిగ్గుండాలని, తాను తలుచుకుంటే జగన్ తో సహ వైసీపీ నేతల చీకటి బాగోతాలని బయటపెడతానని అన్నారు. ఇక పవన్ విమర్శలు చేసిన వెంటనే వైసీపీ నేతలు రంగంలో దిగేశారు. ఎప్పటిలాగానే మంత్రి అంబటి రాంబాబు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎంపీలు నందిగం సురేష్, మార్గని భరత్…ఇలా వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్‌ని గట్టిగానే తిట్టారు.
పవన్ కళ్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందని, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు.. అసాంఘిక శక్తి అంటూ ఎంపీ నందిగం సురేష్ విమర్శలు చేయడం విశేషం. వైసీపీ పోవడం తరవాత పవన్ ముందు ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ చీడ పురుగు అని, పవన్ మ్యాడ్ డాగ్. పిచ్చికుక్క అంటూ అంబటి ఫైర్ అయ్యారు.
పవన్ తనని తాను మోసం చేసుకుంటూన్నారని..మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, పవన్ కల్యాణ్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు తప్ప తన కోసం కాదని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఇలా వైసీపీ నేతలు వరుసగా పవన్ పై ఫైర్ అయ్యారు. మరి ప్రజలు పవన్ మాటలు నమ్ముతారో..లేక వైసీపీ నేతల మాటలు నమ్ముతారో చూడాలి.