నల్గొండ-ఖమ్మంలో భారీ ట్విస్ట్..ఆధిక్యం ఎవరికంటే?

-

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే మళ్ళీ అధికారం సొంతం చేసుకోవాలని బి‌ఆర్‌ఎస్ తన వ్యూహాలని మొదలుపెట్టేసింది. అటు రెండు సార్లు ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్..ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని కష్టపడుతుంది. ఈ రెండు పార్టీల మధ్యలో బి‌జే‌పి కూడా రేసులోకి వచ్చి..అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది.

ఇలా మూడు పార్టీల వ్యూహాలు ఎక్కడకక్కడకు అదిరిపోయే స్థాయిలో వేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంపై పట్టు సాధించే దిశగా వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే ఈ సారి ప్రతి జిల్లాలో ఆధిక్యం సాధించాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టి సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఈ జిల్లాల్లో బలం పెంచుకోవడానికి రెండు పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. అయితే గతంలో ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది. 2014 తర్వాత నుంచి నల్గొండపై బి‌ఆర్‌ఎస్, ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది.

ఇక ఈ సారి ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కానీ ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వైపుకు రావడంతో సీన్ మారిపోయింది. అటు నల్గొండలో కొందరు బి‌ఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ వైపుకు వస్తున్నారు. దీంతో రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం ఉందని తెలుస్తుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పాలి. నల్గొండలో 12 సీట్లు ఉంటే దాదాపు 7 సీట్లలో కాంగ్రెస్ కు ఆధిక్యం ఉంది. అటు ఖమ్మంలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్‌కు 7 సీట్లలో లీడ్ ఉంది. అంటే ఓవరాల్ గా రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం.

Read more RELATED
Recommended to you

Latest news