వైసీపీ వర్సెస్ బీజేపీ: ఫైట్ షురూ..క్రియేట్ చేశారా?

-

ఏపీలో ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపించిన వైసీపీ, బి‌జే‌పి..ఇప్పుడు రూట్ మార్చాయి. రెండు పార్టీలు ప్రత్యర్ధులుగా మారిపోయి రాజకీయ యుద్ధంలోకి దిగాయి. అయితే మొన్నటివరకు కొందరు బి‌జే‌పి నేతలే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అవి పెద్దగా ఇంపాక్ట్ చూపేవి కాదు. అటు కేంద్రంలోని పెద్దలు తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు. పైగా పరోక్షంగా సాయం చేశారని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు.

కానీ ఇటీవలే టి‌డి‌పి అధినేత చంద్రబాబు..అమిత్ షా, జే‌పి నడ్డాలని కలిశారు. దీంతో అక్కడ నుంచి టి‌డి‌పి, జనసేనలతో బి‌జే‌పి పొత్తు ఉంటుందని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, జే‌పి నడ్డా..జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. అయితే టి‌డి‌పి ఇచ్చిన స్క్రిప్ట్‌నే బి‌జే‌పి నేతలు చదివారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు.

గతంలో టి‌డి‌పి-బి‌జేపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇక జగన్ సైతం తనకు బి‌జే‌పి కూడా అండగా లేదని అన్నారు. ఇక వైసీపీ నేతల విమర్శలకు బి‌జే‌పి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై అమిత్ షా మాట్లాడారని, రాష్ట్ర ప్రభుత్వం, అరాచకాలు , అక్రమాలు గురించి మాట్లాడితే వైసీపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని జి‌వి‌ఎల్ ప్రశ్నించారు. పరిపాలన పేరుతో అక్రమాలు చేశారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి తమకు లేదని, బీజేపీ ఎవరికీ అండగా ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు.

ఇలా వైసీపీ, బి‌జే‌పి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఇది రెండు పార్టీల కావాలని క్రియేట్ చేసాయా? లేక నిజంగానే రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా? అనేది తెలియడం లేదు. అయితే ఏపీలో బి‌జే‌పికి ఉన్న యాంటీని టి‌డి‌పి వైపుకు వెళ్ళేలా వైసీపీ ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news