జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టిడిపి, దాని అనుకూల మీడియా ఏ రకంగా ఆయనపై విషప్రచారం చేయడానికి పూనుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ సీఎం పీఠంలో కూర్చోవడమే ఆలస్యం ఆయనాపి బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు…జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు అండగా ఉండాలని జగన్ ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేయాలని టిడిపి అనుకూల పచ్చ మీడియా ప్రయత్నిస్తూనే ఉంది.
జగన్ పాలన పట్ల రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఆయన పాలనకు నిదర్శనంగానే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాలు. చరిత్రలో లేని విధంగా వైసీపీ విజయం అందుకుంది. అయినా సరే జగన్‌ని నెగిటివ్ చేయాలని ఆ మీడియా ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే సిఎం జగన్ సైతం….ఆ మీడియా గురించి డైరక్ట్‌గా మాట్లాడుతున్నారు.
అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, సంక్షేమ పధకాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని, ఇళ్ల నిర్మాణం, పేదలకు ఇంగ్లీషు మీడియంలకు బ్రేక్ వేశారని జగన్ ఫైర్ అవుతున్నారు. పచ్చ చానళ్లు, పచ్చ పత్రికల అబద్దాలు తప్ప, నిజాలు చెప్పవని, చివరకి సీఎంనే బోషడికే అనే స్థాయికి దిగజారారని విమర్శించారు. ప్రజలకు మంచి చేస్తున్న తనని తిడుతున్నారని, అలాగే తన తల్లిని కూడా తిడతారా అని జగన్ ఫైర్ అయ్యారు.
అయితే జగన్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనే చెప్పాలి….జగన్ ప్రజలు మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్ష టిడిపి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అలాగే అనుకూల మీడియా కూడా విషప్రచారం చేస్తుంది…ఆఖరికి డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రజలని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి యెల్లో పార్టీ, యెల్లో మీడియాల గురించి ప్రజలే క్లియర్ గా తెలుసుకోవాలి. జనాలకు మంచి చేసే జగన్‌ని అర్ధం చేసుకోవాలి.
—