ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాజకీయ వ్యూహాలు పరిపాలనా వ్యూహాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కనీసం ఊహకు కూడా అందడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత మాత్రం బాగోకపోయినా కేంద్రం సహకారం లేకపోయినా సరే ఆయన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
అంత వరకు బాగానే ఉంది గాని, ఆయన కేంద్రాన్ని నిధులు అడగడం లేదు. ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే ఇక్కడ తెలుగుదేశం ఆలోచన విషయానికి వస్తే, ఆయనకు కేంద్రం సహకారం అందించకపోతే రాష్ట్రంలో పరిపాలన అనేది సాధ్యం కాదని భావించారు అందరూ… కాని అది ఎక్కడా కనపడటం లేదు. కేంద్రాన్ని అడగకుండా కూడా జగన్ ముందుకి వెళ్ళడం చూసి చంద్రబాబు ఆశ్చర్యపోతున్నారు.
వాస్తవానికి కంపెనీలు రాకపోవడంతో రాష్ట్ర ఆదాయం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనితో రాష్ట్రంలో పరిపాలన అనేది కష్టంగా మారింది. వాస్తవానికి జగన్ కి అనుభవం లేదు. అయినా సరే ఆయన పరిపాలించడం చూసి, ఎదురు చూద్దాం అనుకున్న బిజెపి కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు రాజధాని తరలింపు అనే కార్యక్రమం జగన్ ముందు ఉంది. దీనితో రాజధానిని తరలించడానికి ఖర్చు అవుతుంది.
అయినా సరే జగన్ వెనక్కు తగ్గడం లేదు. రాజధానిని తరలించడానికి అన్ని విధాలుగా సిద్దమయ్యారు. ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు కూడా కేంద్రం సహాయం కోసం చూస్తుంటే జగన్ మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. ఆయన చేసేది చేస్తున్నారు. దీనితో జగన్ వ్యూహాలు ఏంటి, ఆయన ఏ విధంగా ముందుకి వెళ్తున్నారు అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా అంతుబట్టడం లేదు.