‘కమ్మ’ని రాజకీయం.. వైసీపీ ‘వల’?

-

రాజకీయం అంటే రాజకీయమే…రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయం చేయడానికి చూస్తారు…అసలు వేసే ప్రతి అడుగులోనూ…మాట్లాడే ప్రతి మాటలోనూ రాజకీయమే ఉంటుంది..ఏదో కొంతమంది మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తారు తప్ప…మిగతా నేతలంతా రాజకీయమే చేస్తారు…అయితే ఏపీలో ఉన్న ప్రతి పార్టీ ఇప్పుడు రాజకీయం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. మళ్ళీ గెలవాలని వైసీపీ, ఈ సారైనా గెలవాలని టీడీపీ, టీడీపీతో కలిసైన అధికారం దక్కించుకోవాలని జనసేన..ఇలా ప్రతి పార్టీ అధికారమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నాయి.

ఇక ఇటీవల టీడీపీ-జనసేన పొత్తు విషయంలో క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే..ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నారు…తాజాగా పవన్ సైతం పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి..పొత్తు ఉంటే మాత్రం వైసీపీకి ఇబ్బంది అని చెప్పొచ్చు..ఎంత కాదు అనుకున్న చాలా సీట్లలో పొత్తు ప్రభావం ఉంటుంది..టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి చెక్ పడటం ఖాయం.

అయితే పొత్తు ఉంటుందని వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చేసింది..ఈ పొత్తు వల్ల తమకు నష్టమనే సంగతి కూడా వారికి అర్ధమవుతుంది. అందుకే ఈ పొత్తుకు ముందుగానే బ్రేకులు వేయాలని వైసీపీ నేతలు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అటు టీడీపీ టీడీపీకి సపోర్ట్ గా ఉన్న కమ్మ కులాన్ని, ఇటు జనసైనికులని పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. వారికి వారికి గొడవలు పెట్టేలా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు.

కమ్మ కులాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏనాడైనా ద్వేషించారా అని, వైసీపీలో ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ లేరా అని పేర్ని నాని చెప్పుకొస్తున్నారు.

పవన్‌ ముఖ్యమంత్రి అయ్యేదీ లేదు.. చచ్చేదీ లేదని, బాబును సీఎంను చేయడానికి జనసేన ఎందుకు? ఇతనే టీడీపీలో చేరిపోతే అయిపోయిద్ది కదా అని..ఇక జనసైనికులు..చంద్రబాబు పల్లకిని మోయడానికి సిద్ధంగా ఉండాలని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అంటే పరోక్షంగా జనసైనికులని రెచ్చగొడుతున్నారు. అసలు పొత్తుకు చెక్ పెట్టాలని వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు…మరి వైసీపీ నేతల స్ట్రాటజీ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news