ప్రధాని మోడీకి నిద్ర లేని రోగం..వైద్యుల‌కు చూపించండి : ప్రకాశ్ రాజ్ సంచలనం

-

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ రేంజ్‌ లో సెటైర్ వేశారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రకాంత్ పాటిల్‌ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్ర పోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని చంద్రకాంత్ పాటిల్ ఈ మధ్య పేర్కొన్నారు.

అయితే.. చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి.. ప్రధాని మోడీకి నిద్ర పోలేక పోవడం అనేది ఓ జబ్బు అంటూ చురకలు అంటించారు ప్రకాశ్‌ రాజ్‌. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారని ఓ రేంజ్‌ లో సెటైర్ పేల్చారు ప్రకాశ్ రాజ్‌. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’  అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారింది. మరి దీనికి బీజేపీ ఎలా కౌంటర్‌ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version